మేడారం జాతరకు రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే!

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మేడారం జాతర ఆదాయం రూ.13,25,22,511 వచ్చింది. గతంలో కన్నా ఈసారి ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్​బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నాలుగురోజుల పాటు వైభవంగా సాగిన మేడారం జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద […]