‘Sadak Bandh’ – ‘సడక్ బంద్’
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం, ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. 29న ‘సడక్ బంద్’కు పిలుపునిచ్చిన ఐకాస.. పక్షం రోజులుగా ప్రచారం చేస్తోంది. దీంతో శుక్రవారం ఉదయమే ఐకాస, అఖిలపక్ష నాయకుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని కొమురవెల్లి ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు మూడు బృందాలుగా విడిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి మూడుచోట్ల రాస్తారోకో చేశారు. ఒక బృందం చేర్యాల పాతబస్టాండు వద్ద, […]