Movie : ‘ఆపరేషన్ వాలెంటైన్’
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిసెంబరు 8న విడుదల కానున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్రబృందం. భారతదేశంలోని వైమానిక దళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోని పిక్చర్స్ ఇంటర్నేషన్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ఫైటర్ పైలట్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు వరుణ్.