Manipur – ఉచ్చులో కమాండోలు..

చొరబాటుదారుల ఉచ్చులో చిక్కుకున్న మణిపుర్ పోలీసు కమాండోల (Manipur Police commandos )ను సైన్యానికి చెందిన అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) బృందం కాపాడింది. కొండపై నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుంటే డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టి వారిని రక్షించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..? అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఇటీవల ఓ సీనియర్‌ పోలీసు అధికారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మోరే […]

Manipur – మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం 8 వరకు పొడిగింపు

మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌పై మణిపుర్‌లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపుర్‌ రైఫిల్స్‌ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించవచ్చనే ఉద్దేశంతో దీనిని పొడిగించాలని నిర్ణయించారు. సెప్టెంబరులో కొన్నిరోజులు మినహా మే 3 నుంచి ఎప్పటికప్పుడు నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.

Manipur : మరో దారుణం..

మణిపుర్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో ఓ వ్యక్తి శరీరం కాలిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా వ్యాప్తిలో ఉన్నాయి. మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన రోజే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు.  ఏడు సెకన్ల నిడివి ఉన్న తాజా వీడియోలో నల్ల టీషర్టు, ప్యాంటు ధరించిన వ్యక్తి దేహం మంటల్లో కాలిపోతోంది. అప్పటికే అతను చనిపోయినట్లు […]

Manipur Violence: మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. ఐపీఎస్‌ అధికారికి పిలుపు..

మణిపుర్‌లో మరోసారి కల్లోల పరిస్థితులు (Manipur Violence) నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎస్‌ఎస్పీ రాకేశ్‌ బల్వాల్‌ (Rakesh Balwal)ను తన సొంత కేడర్‌ అయిన మణిపుర్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Home Minitsry) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Manipur – కొంతకాలంగా కనిపించని ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్‌ (Internet Services) సేవలపై విధించిన ఆంక్షలను గతవారం మణిపుర్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఫొటోలు వైరల్‌ (Viral Photos) అవుతున్నాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. […]

Manipur violence – మణిపూర్ హింస

జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్‌ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది.అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు […]

Manipur Violence-ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది….

జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్‌(Manipur)లో ఇంకా పూర్తిగా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 175 మంది మృతి చెందారని రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది. 33 మంది అదృశ్యమయ్యారని, 1,118 మంది గాయపడ్డారని తెలిపింది. చనిపోయిన 175 మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. (Manipur Violence)  మే 3న తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది. […]