24 people died in 24 hours – 24 గంటల్లో 24 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల్లో 24 మంది మరణించారు. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మిగిలినవారు పెద్దవారు. ‘నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో 24 మంది చనిపోయారు. చనిపోయిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారు’ అని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరు దిలీప్‌ మైశేఖర్‌ సోమవారం వెల్లడించారు. ఈ విషాదంపై ముగ్గురు […]