TDP: పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్: తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. అంతు చూస్తామని నన్ను బెదిరించారు. తెదేపా ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి […]