Pawan Kalyan: Pawan’s campaign. Tenali public meeting cancelled పవన్ ప్రచారానికి బ్రేక్.. తెనాలి బహిరంగ సభ రద్దు
కాకినాడజిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్. మూడురోజుల పాటు పర్యటించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. అంతలోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది. తీవ్రమైన జ్వరంతో తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు […]