Mahaganapati – మహాగణపతికి 2200 కిలోల లడ్డూ…

హైదరాబాద్: ఖైరతాబాద్‌ మహాగణపతికి బుధవారం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యాపారవేత్త జనల్లి శ్రీకాంత్‌ 2200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం మహాగణపతికి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. భారీ లడ్డూను తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపు మధ్య క్రేన్‌ సాయంతో మహాగణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారని […]