Telangana congress: Konappa Joined Congress party కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప

 సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగజ్‌ నగర్‌ పట్టణంలోని విన య్‌ గార్డెన్‌లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్‌చార్జ్‌ జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్‌ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. […]

బీఆర్‌ఎస్‌కు కోనప్ప గుడ్‌బై..! సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటితో భేటీ

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ నేత, సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్‌లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్‌  ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. […]