బీజేపీ నేతలతో టచ్‌లో హరీష్‌రావు: కోమటిరెడ్డి వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బీజేపీ చేరుతారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు హరీష్‌రావు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నాడని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.  కాగా, భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌లో ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌కు ఇస్తే అల్లుడు హరీష్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తాడు.. అలాగే, అల్లుడికి ఇస్తే […]