KKR-Shreyas Iyer: ఫస్ట్ బౌలింగ్ చేయడమే లక్కీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు థ్యాంక్స్: శ్రేయస్
మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలవడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒడిసి పట్టింది. తుది పోరులో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ ప్లేయర్లు ఫైనల్‌లోనూ ఇదే ఆటతీరుతో రాణించారు. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ప్రత్యర్థి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తమ జట్టు విజయం వెనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యం […]