Israel – కాస్త తగ్గుతోందా..?

హమాస్‌(Hamas)ను భూస్థాపితం చేసేవరకు గాజాపై తమ దాడులు ఆపమన్న ఇజ్రాయెల్(Israel) .. భీకర ఘర్షణలకు ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకువచ్చింది. మానవతా సాయం, బందీల విడుదల కోసం గాజాలో వ్యూహాత్మక విరామాలను పరిశీలిస్తామని వెల్లడించింది. (Israel Hamas Conflict) ‘మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీలను విడిపించేందుకు వ్యూహాత్మక స్వల్ప విరామాలను మా దేశం పరిశీలిస్తోంది’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. అమెరికా శ్వేతసౌధ ప్రతినిధి జాన్‌ కిర్బీ […]

Delhi – 13 నుంచి సరి-బేసి విధానం

ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు దిల్లీలో ఈ నెల 13 నుంచి  వాహనాలకు సరి-బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి అనుమతిస్తారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయులకు ఏడెనిమిది రెట్ల కాలుష్యం […]

Manipur – ఉచ్చులో కమాండోలు..

చొరబాటుదారుల ఉచ్చులో చిక్కుకున్న మణిపుర్ పోలీసు కమాండోల (Manipur Police commandos )ను సైన్యానికి చెందిన అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) బృందం కాపాడింది. కొండపై నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుంటే డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టి వారిని రక్షించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..? అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఇటీవల ఓ సీనియర్‌ పోలీసు అధికారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మోరే […]

Turkey : ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీ..

గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా ( Palestine)కు మద్దతుగా తుర్కియే ( Turkey)లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గాజాలో పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం తుర్కియే వచ్చారు. ఆయన రావడానికి కొద్ది గంటల ముందు తుర్కియే రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు […]

Russia – దాడిలో రష్యా యుద్ధనౌక ధ్వంసం

రష్యా ఆధీనంలోని క్రిమియాలో ఉన్న కెర్చ్‌ నగరంపై ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 అస్త్రాలను రష్యా కూల్చేసింది. ఓ క్షిపణి రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నష్టం తీవ్రత ఎంతన్నది వెల్లడి కాలేదు. దెబ్బతిన్న నౌకలో కల్బిర్‌ క్షిపణులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన కమాండర్‌ మైకొలా ఒలెస్చుక్‌ తెలిపారు. ‘‘మరో నౌక మాస్కోవా బాట పట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ […]

Test-fired – ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా

అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్‌ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం. ఇప్పటికే అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. అమెరికాతో సమాన స్థాయిని సాధించడానికి ఇది అవసరమని రష్యా పేర్కొంది. తాజా పరీక్షలో […]

Hamburg – విమానాశ్రయంలో వీడిన ఉత్కంఠ

జర్మనీలోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు కారు సాయంతో విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా  గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు […]

Manipur – మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం 8 వరకు పొడిగింపు

మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌పై మణిపుర్‌లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపుర్‌ రైఫిల్స్‌ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించవచ్చనే ఉద్దేశంతో దీనిని పొడిగించాలని నిర్ణయించారు. సెప్టెంబరులో కొన్నిరోజులు మినహా మే 3 నుంచి ఎప్పటికప్పుడు నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.

Kerela – భారీ వర్షాలు ఆదివారం రాష్ట్రాన్ని ముంచెత్తాయి

భారీ వర్షాలు ఆదివారం కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అధిక వర్షపాతం నమోదవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పథనంథిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్‌ హెచ్చరికను.. అలప్పుజ, ఎర్నాకులం, పాలక్కడ్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా కేరళలో వర్షాలు పడుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. దక్షిణ తమిళనాడుతో పాటు పొరుగు ప్రాంతాల్లో వాయుగుండం […]

Israle-Hamas Conflict : గాజాపై యుద్ధానికి అమెరికాదే పూర్తి బాధ్యత

అమెరికా యుద్ధ నౌకలకు(US Naval Fleet) బయపడేది లేదని మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్‌బొల్లా(Hezbollah) చీఫ్‌ హసన్‌ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం(Israel-Hamas Conflict) లెబనాన్‌లోకి విస్తరించేందుకు అన్ని మార్గాలు తెరుచుకొని ఉన్నాయన్నారు. హమాస్‌ మిలిటెంట్లు- ఇజ్రాయెల్‌ సైన్యం(IDF) మధ్య యుద్ధం మొదలైన ఇన్ని రోజుల తర్వాత హెజ్‌బొల్లా అధిపతి నస్రల్లా తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. గాజాపై యద్ధానికి అమెరికాదే బాధ్యత అన్నారు. పాలస్తీనా భూభాగంలో దాడులను ఆపడం ద్వారా ప్రాంతీయ మంటలను వాషింగ్టన్‌ నిరోధించగలదన్నారు. ఈయుద్ధం ఒక […]