Rashmika – మద్దతుగా చిత్రసీమ..
ప్రముఖ కథానాయిక రష్మికని లక్ష్యంగా చేసుకుని సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికకి మద్దతుగా నిలుస్తున్నారు. మహిళల రక్షణకి భంగం కలిగించే ఇలాంటి నకిలీలపైనా, సాంకేతికతపైనా చర్చ జరుగుతుండగా ఇలాంటి వీడియోల్ని సృష్టిస్తున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ రష్మికకి అండగా నిలిచారు. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ… ‘‘మరో మహిళకి […]