సూపర్ సిక్స్ పథకాలపై తెదేపా ప్రచారం

ఎమ్మిగనూరు వ్యవసాయం పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాల గురించి వివరించారు. ఒక కుటుంబం ఏడాదికి ఎంత లబ్ధిపొందుతారో గణాంకాలతో తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిపిస్తేనే రాష్ట్రంలోని […]

TDP-Janasena: చంద్రబాబుతో పవన్‌ భేటీ.. దిల్లీ పరిణామాలపై చర్చ!

తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు. తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్‌ దిల్లీ వెళ్లే […]

AP BJP: దిల్లీకి బయల్దేరిన దగ్గుబాటి పురందేశ్వరి

భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు అమరావతి: భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో ఆమె చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర నేతలు సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు భాజపా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌ సమర్పించారు. తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరనుందనే […]

మళ్లీ జగన్‌ భజన

ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా ముఖ్యమంత్రి జగన్‌కు తనివితీరినట్టు లేదు. అమరావతి: ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత […]

TDP: త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు. అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో […]

ఈ సారి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా

‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. పదేళ్లలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. పదేళ్లలో ‘విజన్‌ విశాఖ’ సాకారమయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం, పీపీపీ విధానం, ప్రైవేటు వ్యక్తులు ఈ […]

Rishi Sunak – బ్రిటన్‌లో దీపావళి సంబరాలు షురూ..

విదేశాల్లోని భారతీయులు అప్పుడే దీపావళి వేడుకలు మొదలుపెట్టారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అక్కడి హిందువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రధాని రిషి సునాక్‌ తన నివాసం 10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో హిందువులకు ఆతిథ్యమిచ్చారు. వారితో కలిని దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి అక్షతామూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో […]

Smartwatch : సీఈఓ ప్రాణాలు కాపాడింది

టెక్నాలజీతో కొన్ని ప్రతికూలతలు ఉన్న మాట వాస్తవమే అయినా.. వాటి వల్ల జరిగే మేలునూ విస్మరించకూడదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లిన ఓ కంపెనీ సీఈవోను స్మార్ట్‌వాచ్‌ (Smartwatch) కాపాడింది. ఆ వాచ్‌ సాయంతో సమయానికి ఆ సీఈఓ తన భార్యకు సమాచారం ఇవ్వడం.. నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. స్మార్ట్‌వాచే తనను కాపాడిందని ఆ సీఈఓనే స్వయంగా పోస్ట్‌ చేశారు. యూకేకు చెందిన 42 ఏళ్ల […]

Tesla – భారత్‌కు కార్లు.. వయా జర్మనీ

టెస్లా సంస్థ జర్మనీలోని తమ గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. చైనాలోని షాంఘైలోనూ గిగాఫ్యాక్టరీ ఉన్నా, అక్కడ నుంచి విద్యుత్‌ కార్ల దిగుమతికి భారత అధికారులు ససేమిరా అనడంతో టెస్లా ఈ యోచన చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’  పేర్కొంది. టెస్లాకు ఐరోపాలో తొలి ఫ్యాక్టరీ కూడా జర్మనీ గిగాఫ్యాక్టరీనే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన టెస్లా, 25,000 డాలర్ల (రూ.20 లక్షలపైన) కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని […]

RAMOJI Film City – ‘పుష్ప’.. ‘సలార్‌’ ఆటా పాటా

రామోజీ ఫిల్మ్‌సిటీ భారీ సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉంది. ఓ వైపు ‘పుష్ప 2’ మరోవైపు ‘సలార్‌’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాయి చిత్ర బృందాలు. పాటన్నా… పుష్ప ఫైట్‌ అన్నా తగ్గేదేలే అన్నట్టుగా భారీగా ఉండాల్సిందే. ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే మామూలుగా ఉంటుందా? జాతరంత సందడి కనిపించి తీరాల్సిందే. ‘పుష్ప 2’ కోసం సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటని తెరకెక్కిస్తున్నారు. గణేశ్‌ ఆచార్య ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. […]