Nara Lokesh: ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. జగన్‌పై మండిపడిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మడకశిర: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం తేలలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న పవన్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడలేదు. రోజుకో కొత్త నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బరిలోకి దిగిన గాజువాక, భీమవరం నుంచి మాత్రం పోటీ చేయరని జనసేన నేతలు చెబుతున్నారు. అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు..? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా..? లేదంటే ఆధ్మాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా..? అసెంబ్లీకి […]

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ?, ఆ నియోజకవర్గమేనా!

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అనూహ్యంగా వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పద్మ ఎన్నికల్లో పోటీ చేయడానికే పదవికి గుడ్ బై చెప్పారంటున్నారు. ప్రధానాంశాలు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ […]

మేడారం జాతరకు రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే!

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మేడారం జాతర ఆదాయం రూ.13,25,22,511 వచ్చింది. గతంలో కన్నా ఈసారి ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్​బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నాలుగురోజుల పాటు వైభవంగా సాగిన మేడారం జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద […]

నా కొడకల్లారా.. పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకుని ఊరేగుతాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలిశానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోతే.. మోదీని కూడా ఉతికి ఆరేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా ట్రై చేసినా.. నా కొడకల్లారా ఒక్కొక్కన్ని పడబెట్టి తొక్కుతామని పేగులు బయటకు తీసి మెడలేసుకుని ఊరేగుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి.. అగ్గి కణికలై, మానవ బాంబులై.. […]

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న పేర్లను అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. ప్రధానాంశాలు: కాంగ్రెస్ పార్టీ సీఈసీ పరిశీలనలో ఈ పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్: ఫిరోజ్ ఖాన్సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్మెదక్ : నీలం మధుచేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డినల్గొండ : జానారెడ్డిభువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డిమహబూబ్‌గర్: వంశీచంద్ రెడ్డినాగర్ కర్నూల్ : […]

తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టావ్.. నిన్ను చరిత్ర క్షమించదు.. రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం పెరిగిపోయింది. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీశ్ రావుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యతిరేఖించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్టును ఆయన […]

అన్నదాతలకు అండగా ప్రభుత్వం

రాష్ట్రంలో కరవు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌: రాష్ట్రంలో కరవు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’ పేరిట వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలను సీఎం బుధవారం ఉదయం తన నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ, ఆబ్కారీ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి […]

అడిగిన సమాచారం ఉందా.. లేదా?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ఇంజినీర్లను కోరింది. హైదరాబాద్‌: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ఇంజినీర్లను కోరింది. ‘సమాచారం ఉంటే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. అరకొరగా ఉంటే అదైనా ఇవ్వండి. సమాచారం ఇచ్చినా.. లేదని చెప్పినా అధికారికంగా ఉండాలి. బాధ్యులు సంతకం చేసి ఆ విషయం తెలియజేయాలి’ […]

MLC Kavitha: దిల్లీ లిక్కర్‌ కేసులో నేనూ బాధితురాలినే: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ కేసును టీవీ సీరియల్‌ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు హైదరాబాద్: దిల్లీ లిక్కర్‌ కేసును టీవీ సీరియల్‌ మాదిరిగా సాగదీస్తున్నారని భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆ కేసులో తానూ బాధితురాలినేనని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని.. ఆదర్శ్‌ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ […]