First song from Ram Charan’s ‘Game Changer’ రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి […]

CSK vs GT, IPL 2024:  Gujarat Titans who lost badly

మంగళవారం (మార్చి 26) రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఏకంగా 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అదరగొట్టింది. మొదటి మ్యాచ్ లో పటిష్ఠమైన ముంబైను ఓడించిన గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం (మార్చి […]

Afghanistan is a shock for India football భారత్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌ 

ఫుట్‌బాల్‌లో భారత జట్టు దీనావస్థను చూపించే మరో ఉదాహరణ! ఆసియాలో అనామక జట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌తో నాలుగు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయకుండా ‘డ్రా’గా ముగించిన భారత్‌ ఆటతీరు ఈసారి మరింత దిగజారింది. 2026 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లోనూ భారత్‌ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. చివరకు 1–2 గోల్స్‌ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో […]

IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ శ్రీలంక ఆటగాడు మరికొన్నాళ్లపాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం కారణంగా.. అతడు ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంపులో చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. కాగా వనిందు హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో లంక తరఫున బరిలోకి దిగాడు. బంగ్లాతో వన్డే, టీ20 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు తీశాడు. అయితే, ఈ […]

CAA NEWS : America is worried about the implementation of CAA సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. న్యూయార్క్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, […]

What happened in Goa.. Where is the mayor’s daughter? గోవాలో ఏం జరిగింది.. మేయర్‌ కుమార్తె ఎక్కడ?

నేపాల్‌కు చెందిన ఓ మహిళ భారత్‌లోని గోవాలో అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ఆదివారం తెలియజేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నేపాల్‌లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్‌ కుమార్తె  అయిన ఆర్తీ హామల్‌ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్‌ సెంటర్‌లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్‌ […]

Baltimore bridge collapse: అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

బాల్టిమోర్‌లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో (Baltimore bridge collapse) గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన […]

Miss Universe 2024: తొలిసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది. దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ దేశానికి రూమీ అల్కహ్తాని (27) అనే మోడల్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ […]

ED Search Operation: వాషింగ్‌ మెషిన్‌లో దాచిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు..

హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్‌కతా వంటి పలు మేజర్‌ సిటీలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఈడీ సెర్చ్ ఆపరేషన్‌లో అధికారులకు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఓ ఇంట్లోని వాహింగ్‌ మెషిన్‌లో రూ.2.54 కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.. హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్‌కతా వంటి […]

AP News Election Commission ఎన్నిక‌ల ప్రచారానికి ముంద‌స్తు అనుమ‌తి త‌ప్పనిస‌రి.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో త్వర‌లో జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం ఎల‌క్షన్ క‌మిష‌న్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి అన్ని జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎస్పీల‌తో ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. ఎన్నిక‌ల‌ను పార‌ద‌ర్శకంగా నిర్వహించ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రంలో త్వర‌లో జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం ఎల‌క్షన్ క‌మిష‌న్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి […]