IPL 2024 : Bad Experience For CSK fan : ఉప్పల్ మ్యాచ్‌లో ధోని అభిమానికి మైండ్ బ్లాంక్..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న యువకుడు స్టేడియంలోకి వెళ్లగానే షాక్ తిన్నాడు. సాధారణంగానే చెన్నైతో.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్‌లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న […]

IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో […]

Avinash Reddy reacted strongly to Sharmila’s comments : షర్మిల వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన అవినాష్‌రెడ్డి

కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు.  మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన.  ‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..  .. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, […]

KTR : Two MLAs who joined Congress should resign: కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్‌

ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. హైదరాబాద్‌: ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు.  ‘‘పదో షెడ్యూల్‌ చట్ట సవరణ స్వాగతించదగినది. కానీ కాంగ్రెస్‌ ఎప్పటిలానే చెప్పేది […]

Encounter at Telangana border.. తెలంగాణ బోర్డర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఒక ఏకే-47 గన్‌, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.   వివరాల ప్రకారం. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అనంతరం, ఘటనా స్థలంలో ఏకే-47 సహా మరో మూడు తుపాకులను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురించి మరింత […]

liquor Case : Twist in liquor scam case.. New tension for Kavitha! లిక్కర్‌ స్కాం కేసులో ట్విస్ట్‌.. కవితకు కొత్త టెన్షన్‌!

ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస​ ఎమ్మెల్సీ కవిత తీహార్‌ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.  వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. […]

The pilot who took the family on a flight for the first time..తొలిసారి కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్…

విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్‌ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రదీప్‌ కృష్ణన్‌ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన […]

India Defense Minister’s Warnings : పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: రక్షణమంత్రి హెచ్చరికలు

న్యూఢిల్లీ:  ఉగ్రవాదాన్ని భారత్‌ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ స్పందిస్తూ..  పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్‌ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్‌ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. […]

America Warning To Israel : ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా.. 

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన ఎరెజ్‌ సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం […]

Earthquake In Newyork : భూకంపంతో వణికిన న్యూయార్క్‌

అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది. న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది. ఆకాశహర్మ్యాల్లో ఉంటున్నవారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా వచ్చిన భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం ఉదయం 10.23 గంటలకు […]