Fire Accident – ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయిలో గోర్‌గోన్‌ ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30మందికిపైగా గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Shraddha Kapoor : మహదేవ్ బెట్టింగ్ యాప్..

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం బాలీవుడ్‌ (Bollywood)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), హాస్యనటుడు కపిల్‌ శర్మ, […]

Suicide – ఒకరు ఉరేసుకొని.. మరొకరు గోదావరి నదిలో దూకి..

నస్పూర్‌;వారు మంచి స్నేహితులు. చదువుకోవడానికి, సరదాగా గడపడానికి ఎక్కడికైనా వెళ్లేవారు. వారిలో ఒకరు ఇటీవల పెళ్లి చేసుకున్న భార్యతో  ఏర్పడిన మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్నాడు.  అది చూసి మిత్రుడు గోదావరి నదిలో దూకగా… రెండు రోజుల తర్వాత, అతను చనిపోయినట్లు గుర్తించారు. చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తుల మధ్య స్నేహం చెక్కుచెదరలేదు. శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.ఈఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్ ఆర్‌కే-8 కాలనీకి చెందిన విశ్రాంత […]

CM KCR- అల్పాహార పథకం…..

నల్గొండ విద్యాశాఖ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం నేటి నుంచి ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రతి జిల్లాలోని నియోజక వర్గంలో ప్రయోగాత్మకంగా మోడల్ స్కూల్‌ను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా ఆరు నియోజకవర్గాల్లో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మన ఊరు మన బడి కింద పని పూర్తి చేసిన పాఠశాలకు ఈ […]

Hospital- ఎంతో మంది పేద రోగుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతోంది….

 సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రి అధిక నాణ్యత కలిగిన వైద్య సేవలు మరియు కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. లెక్కలేనన్ని నిరుపేద రోగుల జీవితాల్లో ఆనందాన్ని తెస్తుంది. పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. మంత్రి తన్నీరు హరీశ్ రావు, కార్పొరేట్ హంగులద్ది అపూర్వ చొరవతో వెయ్యి పడకలతో శాశ్వత ప్రభుత్వ ఆసుపత్రి భవనం (బోధనాసుపత్రి) గురువారం ప్రారంభం కానుంది. 2018లో తొలి అడుగు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నప్పుడు […]

Telangana BJP-బీజేపీ 14 కమిటీలను ఏర్పాటు చేసింది…..

హైదరాబాద్: రానున్న తెలంగాణ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి బీజేపీ 14 కమిటీలను వేసింది. ఈ కమిటీలు చైర్మన్‌, కన్వీనర్‌లను నామినేట్‌ చేశాయి. ఎన్నికల మ్యానిఫెస్టో, ప్రచార కమిటీకి వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తారు. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బహిరంగ సభలకు బండి సంజయ్, చార్జిషీట్ కమిటీకి మురళీధర్ రావు, పోరాట కమిటీకి విజయశాంతి ఎంపికయ్యారు. వీటితోపాటు పలు ఇతర కమిటీలకు నేతలను నామినేట్ చేస్తూ […]

BRS : భారాసలోకి నందికంటి శ్రీధర్‌

భారాసలో అధిష్ఠానమంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని, తమకు దిల్లీలో బాసులెవరూ లేరని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మేడ్చల్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ బుధవారం తన అనుచరులతో కలిసి భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసిన శ్రీధర్‌కు అక్కడ అన్యాయం జరిగిందని,  భారాసలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఆయనకు, ఆయనతో పాటు వచ్చిన అనుచరులకు […]

B.Tech students-ముగ్గురు యువకులు జల్సాల కోసం గంజాయిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు…

చదువు కోసం నగరానికి వచ్చిన ముగ్గురు యువకులు జల్సాల కోసం గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముగ్గురు విద్యార్థులు నగరంలోని బీటెక్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ఇంజెక్షన్లు చేస్తున్నారు. నాగోలు, దిల్‌సుఖ్‌నగర్: చదువు కోసం నగరానికి వచ్చిన ముగ్గురు యువకులు జల్సాల కోసం గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముగ్గురు విద్యార్థులు నగరంలోని బీటెక్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ఇంజెక్షన్లు చేస్తున్నారు. ఈ సమయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ […]

BRS : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి.. పార్టీకి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి.. భారాస(BRS) పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మనోహర్ రెడ్డి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరు కానున్నారు. మనోహర్ రెడ్డికి కాంగ్రెస్‌ తరఫున […]

Attack : ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి

గుంటూరులోని ఎల్ఐసీ కాలనీలో ఓ వివాహితపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మధుకుమారి అనే మహిళ తన కుమారుడిని పాఠశాలలో వదిలి స్కూటీపై వస్తుండగా.. ఆమెను నలుగురు దుండగులు అడ్డగించారు. స్కూటీ ఆపగానే ఆమెపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా పొడవటంతో మధుకుమారి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగులు అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో తన భర్తతో విబేధాలు ఉండేవని, ఇప్పుడు కలిసే ఉంటున్నట్లు […]