Israel–Palestinian – వివాదం

ఈ నేపథ్యంలో పదుల కొద్దీ అదనపు దళాలను ఇజ్రాయెల్‌ రంగంలోకి దించుతోంది. ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతు అందించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల నేపథ్యంలో ఆ దేశ విమాన వాహక యుద్ధ నౌకలు తదితరాలు తూర్పు మధ్యదరా సముద్రం వైపు తరలాయి. సమీప ప్రాంతాల యుద్ధ విమాన దళాలను కూడా అమెరికా హుటాహుటిన సమీకరిస్తోంది.ఇజ్రాయెల్‌పై దాడి వెనక ఇరాన్‌ హస్తం, ప్లానింగ్‌ ఉన్నట్టు హమాస్, హెజ్బొల్లా నేతలే స్వయంగా వెల్లడించారు. గాజా స్ట్రిప్‌లో 30 మందికి […]

Afghanistan Earthquake – 2,400కు చేరిన మరణాలు

అఫ్గానిస్తాన్‌లోని హెరాట్‌ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 2,445కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రుల సంఖ్య గతంలో ప్రకటించిన 9,240 కాదన్నారు. 2వేల మంది మాత్రమే గాయపడ్డారన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన […]

Manipur : మరో దారుణం..

మణిపుర్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో ఓ వ్యక్తి శరీరం కాలిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా వ్యాప్తిలో ఉన్నాయి. మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన రోజే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు.  ఏడు సెకన్ల నిడివి ఉన్న తాజా వీడియోలో నల్ల టీషర్టు, ప్యాంటు ధరించిన వ్యక్తి దేహం మంటల్లో కాలిపోతోంది. అప్పటికే అతను చనిపోయినట్లు […]

Flash Floods : సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతి..

సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరినట్లు ఆ రాష్ట్ర అధికారులు సోమవారం తెలిపారు. మృతుల్లో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆచూకీ దొరకని 105 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తీస్తా నదితీర ప్రాంతంలో 40 మృతదేహాలను వెలికితీసినట్లు పశ్చిమ బెంగాల్‌ అధికారులు తెలుపగా.. రెండు రాష్ట్రాలు చెప్పిన గణాంకాల్లో కొన్ని రెండు సార్లు లెక్కించి ఉండొచ్చని సిక్కిం అధికారులు చెబుతున్నారు. అలాగే వరదల్లో […]

MLA – ఒక్కో అభ్యర్ధి రూ.40 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చు.

కామారెడ్డి:ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో జిల్లా పాలనాధికారి జితేష్‌ వి.పాటిల్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల కోసం జిల్లాను 75 రూట్లుగా విభజించాం. ఓటింగ్ స్థలాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మా ప్రాథమిక ఆందోళన. వికలాంగులకు సులువుగా ఉండేలా ర్యాంపులు నిర్మించారు. ఓటింగ్ ప్రక్రియపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు డమ్మీ ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుపై […]

Chhattisgarh : గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు

ఛత్తీస్‌గఢ్‌లో 9 ఏళ్ల బాలిక 5 గంటలపాటు నిరంతరాయంగా నీటిలో ఈది గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. దుర్గ్‌ జిల్లా పురఈ అనే గ్రామం క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామానికి చెందిన తనుశ్రీ కోసరే (9) ఈతపై ఆసక్తితో శిక్షణ తీసుకుంది. రోజూ 7 నుంచి 8 గంటలపాటు సాధన చేసేది. ఆదివారం ఐదు గంటల పాటు ఏకబిగిన చెరువులో ఈది గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ […]

Metro – ఆదాయం పై అడుగులు.

హైదరాబాద్; మెట్రో టిక్కెట్ల విక్రయం కాకుండా ఇతర ఆదాయ మార్గాల అన్వేషణను వేగవంతం చేసింది. L&T కూడా స్టేషన్లలో రిటైల్ లీజుల ద్వారా డబ్బు సంపాదిస్తుంది మరియు మెట్రో మార్గాలపై ప్రకటనల నుండి వచ్చే ఆదాయం మరియు స్టేషన్ పేర్ల హక్కులతో పాటు కార్యాలయాలకు ప్లగ్-అండ్-పే సౌకర్యాలను అందిస్తుంది. ఉప్పల్‌లోని డిపో నుండి మెట్రో రైళ్లు మరియు స్టేషన్‌ల నియంత్రణ మరియు నిఘా కోసం టెలికాం టవర్లు మరియు గణనీయమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను సరైన మార్గంలో […]

Aditya-L1కు సంబంధించి ఇస్రో మరో కీలక విన్యాసం

ఆదిత్య-ఎల్‌1కు సంబంధించి ఇస్రో మరో కీలక విన్యాసం చేపట్టింది. ప్రస్తుతం లగ్రాంజియన్‌-1(ఎల్‌1) పాయింట్‌ దిశగా వెళుతున్న ఉపగ్రహ మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆదివారం వెల్లడించింది. దీని కోసం స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను 16 సెకన్ల పాటు మండించామని తెలిపింది. అక్టోబరు 6న చేపట్టిన ఈ విన్యాసం వల్ల ఉపగ్రహం వేగం పెరిగి ఎల్‌1 వైపు మరింత కచ్చితత్వంతో ప్రయాణిస్తోందని ఇస్రో పేర్కొంది.

Bigg boss season 7 – ‘2.ఓ’ షురూ..

‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ , ‘ఉల్టా పుల్టా’ అంటూ దాదాపు ఐదు వారాల కిందట మొదలైన ఈ సీజన్‌లో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ ఐదు వారాల్లో ఐదుగురు మహిళా కంటెస్టెంట్‌లను బయటకు పంపిన బిగ్‌బాస్‌ ఈ ఆదివారం శుభశ్రీ, గౌతమ్‌ కృష్ణల డబుల్‌ ఎలిమినేషన్‌తో షాకిచ్చాడు. ఆ కాసేపటికే గౌతమ్‌ కృష్ణను సీక్రెట్‌ రూమ్‌ను పంపి, మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. అంతేకాదు, సీజన్‌-7 ‘2.ఓ’ షురూ చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు […]

Sai Pallavi – వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి(Sai Pallavi) ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీశ్‌ తివారి హిందీలో ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించనుండగా.. సీత పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్లు సమాచారం. […]