Yadadri – ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు

యాదాద్రి:యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆదివారం  భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవులు ఉండడంతో పాటు విద్యార్థులకు దసరా సెలవులు కావడంతో రాష్ట్ర, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గుడి లోపల, గుడి చుట్టూ, దర్శన వరుసల వద్ద, ప్రసాద కౌంటర్ల వద్ద నిండిపోయింది. ధర్మదర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఈ ఆలయాన్ని దాదాపు ముప్పై వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు కొద్దిసేపు […]

America President – జో బైడెన్‌ స్పందించారు

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో శనివారం విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని నివారిద్దామని వారిని కోరారు. అక్కడి సామాన్య ప్రజలకు సహాయం కొనసాగించేందుకు అనుమతించాలని విన్నవించారు. ఇందుకోసం ఐక్యరాజ్య సమితి, ఈజిప్టు, జోర్డాన్‌లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఘర్షణ మరింత విస్తరించకుండా చూడాలని ఇరువురు నేతలకు సూచించారు. […]

Trending – రుసుముకు బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లను స్వీకరిస్తారు

అస్సాం :అస్సాంలోని అక్షర్ స్కూల్‌లోని పమోహి జిల్లా ప్రత్యేకంగా ట్యూషన్‌కు బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లను స్వీకరిస్తుంది. మాజిన్ ముఖ్తార్ మరియు సమంతా శర్మ పేర్లతో ఒక జంట పాఠశాలను సృష్టించారు. రుసుముగా స్వీకరించిన సీసాలు అనేక మార్గాల్లో రీసైకిల్ చేయబడతాయి.ప్లాస్టిక్‌ను ఎలా రీసైకిల్‌ చేయాలో విద్యార్థులకు నేర్పుతున్నారు. నాగాలాండ్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్‌జెన్‌ ఈ స్కూల్‌ గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. ‘గుడ్‌ ఐడియా’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు. 

Paralysis – ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి…

పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి దాదాపు కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ‘ద లాన్సెట్‌’ అంచనావేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనికోసం ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 2020లో పక్షవాతంతో చనిపోయినవారి సంఖ్య 66 లక్షలుగా ఉందని తెలిపింది. గత 30 ఏళ్లలో పక్షవాతంతో మరణించే, వైకల్యం బారినపడే వ్యక్తుల సంఖ్య రెట్టింపు […]

Heart Attack : ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే

ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ఉత్తర భారత్‌ సహా తూర్పు పాకిస్థాన్‌లోని ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. దీని వల్ల దాదాపు 220 కోట్ల మంది ప్రజలు అతి తీవ్ర వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పింది. ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ నివేదికను ప్రచురించింది. ఈ అతి తీవ్రమైన వేడి వల్ల మానవుల్లో వడదెబ్బ, గుండెపోటుతో పాటు అనేక అనారోగ్య […]

Hamas Attack – ఇద్దరు భారత భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల్లో భారత సంతతికి చెందిన కనీసం ఇద్దరు భద్రతాధికారిణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరినీ లెఫ్టినెంట్‌ ఓర్‌ మోజెస్‌ (22), పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కిమ్‌ డొక్రాకెర్‌లుగా  గుర్తించారు. విధి నిర్వహణలో వీరిద్దరూ ప్రాణత్యాగం చేసినట్లు బయటపడింది. ఇంతవరకు 286 మంది సైనికులు, 51 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తేల్చారు. మృతులను, అపహరణకు గురైనవారిని గుర్తించే పని కొనసాగుతున్నందువల్ల ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.

America – మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అడిగింది

చంద్రయాన్‌-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. కాలం మారిందని.. భారత్‌ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదన్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి […]

Air India – కరాచీలో అత్యవసరంగా దిగిన విమానం

దుబాయ్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఒకటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురవడమే ఇందుకు కారణమని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారమే ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ‘‘దుబాయ్‌- అమృత్‌సర్‌ విమానంలోని ఓ ప్రయాణికుడికి మార్గమధ్యలో అకస్మాత్తుగా వైద్యపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో వీలైనంత త్వరగా అతడికి వైద్య సాయం అందించేందుకుగానూ కరాచీ నగరం అత్యంత […]

India – మత్స్యకారుల అరెస్టు

తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్న 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నౌకాదళం ఆదివారం ప్రకటించింది. మన్నార్‌ తీరం సమీపంలో, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో శనివారం మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మన్నార్‌ జల్లాల్లో వేట కొనసాగిస్తున్న రెండు ట్రాలర్లు, 15 మంది భారతీయ మత్స్యకారులను, డెల్ఫ్ట్‌, కచ్చదీవు ద్వీపాల సమీపంలో ఉన్న మూడు ట్రాలర్లు, 12 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది.