Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

Karnataka – ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్‌బళ్లాపూర్‌ పోలీసు అధికారి […]

Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

Canada : వీసా సేవల్ని పునరుద్ధరించనున్న భారత్‌..

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతలతో కెనడా పౌరులకు ఇటీవల భారత్‌ వీసా సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్‌ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టంచేసింది. భద్రతా పరిస్థితులపై సమీక్ష […]

Range Rover: బంపర్‌ ఆఫర్‌.. ₹100కే

అస్సాం(Assam) లోని హౌలీలో ఏటా నిర్వహించే రాస్ ఫెస్టివెల్(Raas Festival) సందర్భంగా నిర్వహించే లాటరీ(Lottery)లో ఈ సారి ఖరీదైన బహుమతులను అందివ్వనున్నట్లు నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం వంద రూపాయలకే రూ.76 లక్షలు విలువచేసే రేంజ్‌రోవర్‌(Range Rover) కారును ప్రథమ బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే ఈ కారును ఎలా గెలుచుకోవాలో చూద్దాం..  అస్సోంలోని హౌలీలో రాస్ పండగను నిర్వహిస్తారు. ఏళ్ల నాటిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా పండగకు ముందు లాటరీ ఈవెంట్‌ను ఏర్పాటు […]

Ram Mandir – ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ బుధవారం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి కోవెలను ప్రారంభించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. ‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావల్సిందిగా నన్ను […]

Rajkumar Rao – ఈసీ నేషనల్ ఐకాన్‌గా బాలీవుడ్‌ స్టార్‌!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నవంబర్‌లో జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ECI) కీలక నిర్ణయం తీసుకుంది.  బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావును నేషనల్‌ ఐకాన్‌గా  నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దిల్లీలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం 11.30గంటలకు రంగ్‌భవన్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఎన్నికల కమిషనర్‌ గురువారం ఆయన్ను అధికారికంగా నియమించనున్నారు. 

Netflix – టాప్ 10లో ‘ఖుషి’..

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న థియేటర్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెలరోజులకు అక్టోబర్‌ 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అందులో ప్రసారం అవుతున్నప్పటి నుంచి టాప్‌ వ్యూస్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్‌ 10లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో ఈ వారం ఎక్కువమంది చూసిన చిత్రాల లిస్ట్‌ను తాజాగా […]

Rajinikanth – మూడు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్‌..

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తన ఆప్త మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తో కలిసి పని చేయడంపై నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. ‘‘33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి వర్క్‌ చేస్తున్నా. లైకా ప్రొడెక్షన్స్‌ పతాకంపై టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రంలో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. అమితానందంతో నా మనసు నిండింది’’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌తో దిగిన ఓ […]

Hardik Pandya – స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా..

గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. హార్దిక్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించే అవకాశాల్ని జట్టు మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. చీలమండ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న హార్దిక్‌ వేగంగా కోలుకుంటున్నాడు.  ఈనెల 29న లఖ్‌నవూలో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడుతుంది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే సూర్యకుమార్‌ స్థానంలో […]