Karimnagar – ఇసి కీలక సూచనలు.
పెద్దపల్లి :శుక్రవారం నుంచి కీలకమైన శాసన సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎక్సపెండిచర్ ఇన్‌స్పెక్టర్‌లుగా, పొరుగు రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులను ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు నియమించారు. నామినేషన్ పత్రాలు స్వీకరించిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు జిల్లాల వారీగా మూడుసార్లు పర్యటించనున్నారు. అభ్యర్థుల జేబు ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నియోజక వర్గాలకు కేటాయించిన వ్యయ పరిశీలకులను ప్రభుత్వ అతిథి గృహాల్లో బస చేసేందుకు చర్చిస్తున్నారు. […]