ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత

దుండిగల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఐఏఆర్‌ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. […]

ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్‌ చేసిన సిఫార్సు లపై గవర్నర్‌ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్‌ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ […]

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయటం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. అమరావతి:  ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే […]

TDP-Janasena-BJP: సీట్ల సర్దుబాటుపై నేడూ చర్చ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

ఏఐ కోసం రూ. వేలకోట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి ‘ఇండియాఏఐ’ (indiaAI) మిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం ఏఐలో దూసుకువెళ్తున్న సమయంలో మన దేశం కూడా ఈ రంగంలో తప్పకుండా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ప్రస్తావించారు. నేడు దీనికి […]

మహాశివరాత్రికి వస్తోన్న ‘రికార్డ్ బ్రేక్’.. అలాంటి సెంటిమెంట్‌తో!

నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు […]

ఫ్యామిలీతో కలిసి ఆలయాన్ని సందర్శించిన రకుల్ ప్రీత్..!

టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత  అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్‌ కరాజ్‌ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ […]

రేవంత్‌ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు బండి సంజయ్‌పైనా మండిపడ్డారు.  .. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ […]

Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో మంత్రి గుడివాడ పోటీ చేయనట్లేనా?…

 ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు’’ అని అన్నారు. అనకాపల్లి జిల్లా, మార్చి 7: ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం […]

AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలచుకొని షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి […]