వందలాది మత్స్యకారుల ఆందోళన.. రోడ్డుపైనే బోటుకు నిప్పు

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు ఆందోళన మూడో రోజుకు చేరింది. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపు లైన్లను తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కొత్తపల్లి:  కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన మూడో రోజుకు చేరింది. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపు లైన్లను తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. యు.కొత్తపేట మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకార కుటుంబాలు కాకినాడ-అద్దరిపేట రహదారిపై బైఠాయించాయి. దీంతో […]

సోదరి మరణించిన కొన్ని గంటలకే నటి మృతి..

టెలివిజన్ నటి డాలీ సోహి కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ‘డాలీ, అమన్‌దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అమన్‌దీప్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు’ అని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం […]

ఆ గాయం నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది: సమంత

సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది’ అని ఆమె ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. […]

మూడేళ్ల తర్వాత.. తెరపైకి ఆండ్రియా చిత్రం

తమిళ చిత్రపరిశ్రమలో బిజీగా ఉండే హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు. ఆమె నటించిన ‘కా’ చిత్రం మూడేళ్ల తర్వాత విడుదలకు నోచుకోనుంది. నిజానికి గత ఏడాది ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి. ఆమె నటించిన ‘అనల్‌ మేల్‌ పనితులి’ 2022లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు గత ఏడాది విడుదలైనప్పటికీ.. ఆశించిన రీతిలో ప్రేక్షకాదారణ పొందలేదు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ‘కా’ చిత్రం చాలా రోజుల తర్వాత విడుదలకు సిద్ధమైంది. […]

విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే…

విశ్వక్ సేన్ వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వైవిధ్యమున్న సినిమా ‘గామి’ అని విశ్వక్, చిత్ర నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనపడనున్నారని ప్రచారాల్లో చెప్పారు. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే.. Gaami Movie Poster సినిమా:  gaami నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, శాంతి రావు, అష్రాఫ్ తదితరులు ఛాయాగ్రహణం: విశ్వనాధ్ రెడ్డి […]

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు: హరీష్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్‎నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన […]

సీఎం హోదాలో తొలిసారిగా ఏపీకి రేవంత్‌.. కాంగ్రెస్ తరుఫున ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ […]

విశాఖ వీధుల్లో కేంద్ర బలగాలు, పోలీస్ ఫ్లాగ్ మార్చ్.. ఎందుకో తెలుసా..!

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ నగరంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించ్చారు. రానున్న ఎన్నికల కోసం విశాఖలో పోలీసులు, కేంద్ర బలగాలు, సన్నద్ధమవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి […]

పవన్‌ కల్యాణ్ పోటీ చేయకపోతే టికెట్‌ వాళ్ళకే.. జనసేన నేతల హామీ!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలకే టికెట్ ఇవ్వాలని అది కూడా లోకల్స్ కే ఇవ్వాలని పట్టు పడుతున్న ఆ సామాజిక వర్గం పవన్‌ పోటీ చేస్తే మాత్రం ఒకే అంటుండడం ఆసక్తికరంగా మారింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో […]

ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు […]