TDP GUNNY TICKEY RALLY : గన్నికి టికెట్‌ ఇవ్వండి.. మేము గెలిపించుకుంటాం

రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా ఆదివారం తరలివెళ్లారు. భీమడోలు, న్యూస్‌టుడే: రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం […]

Nayana Tara Divorce: క్లారిటీ ఇచ్చిన నయన్

విడాకుల వార్తలకు వీడియోతో చెక్‌ పెట్టిన నయనతార దంపతులు. ఇంటర్నెట్‌ డెస్క్: విఘ్నేశ్‌ శివన్‌ నయనతార విడిపోతున్నట్లు కొంతకాలంగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా నయనతార భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం.. మళ్లీ కొంతసేపటికి ఫాలో చేయడం. ‘నేను సర్వం కోల్పోయాను’ అని పోస్ట్‌ పెట్టడం. మళ్లీ దాన్ని డిలీట్‌ చేయడం..  ఇవన్నీ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే వీరు ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు.  కవల పిల్లలతో కలిసి వెకేషన్‌కు […]

అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం

శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి ‘ఒనవిల్లు: ది డివైన్ బో’ పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. […]

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు. తెలుగు భాష, సాహిత్యం వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తా. భాష భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వాలు […]

జగన్‌ రూపాయి ఇచ్చి రూ.10 దోచుకుంటారు: ధూళిపాళ్ల

తనను విమర్శించడం వైకాపా నేతలకు అలవాటైందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నూరు: తనను విమర్శించడం వైకాపా నేతలకు అలవాటైందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రెవెన్యూ లోటు ఉందని.. అయినా ప్రజలపై పైసా భారం లేకుండా చంద్రబాబు పాలించారని చెప్పారు. వైకాపా ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల […]

నలుగురికే లైన్‌క్లియర్‌ 

4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌  జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌కు ఎంపిక  సురేశ్‌ షెటా్కర్, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, వంశీచంద్‌రెడ్డికి టికెట్లు   న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన […]

మిగతా స్థానాలు 20 తర్వాతేనా? 

నాలుగు లోక్‌సభ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌  సీఈసీ తదుపరి భేటీలో ‘తెలంగాణ’పై చర్చకు నో చాన్స్‌  20వ తేదీ తర్వాత జరిగే సమావేశంలోనే మిగతా అభ్యర్థుల ఖరారు చేవెళ్ల సీటు దాదాపు సునీతా మహేందర్‌రెడ్డికే ఖరారు!  హైదరాబాద్‌: ఇప్పటికి నాలుగు లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్‌క్లియర్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ […]

కబ్జా భూములను సరెండర్‌ చెయ్‌

మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. […]

పొత్తులో చెత్త ప్లాన్‌.. చంద్రబాబు మైండ్‌ గేమ్‌లో జనసేన బలి!

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ క్రీడలో జనసేన అధినేత పవన​ కల్యాణ్‌ పావుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్‌ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో, జనసైనికులకు గట్టి షాక్‌ తగిలే అవకాశముంది.  కాగా, చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొత్తు ఉండాలంటే బీజేపీ తాము అడిగిన స్థానాలివ్వాలనే కండీషన్‌ పెట్టింది. దీంతో, బీజేపీ అడుగుతున్న స్థానాల […]

అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ.. ఎన్డీయేలోకి తెదేపాను ఆహ్వానించిన భాజపా

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు దిల్లీ : భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీయేలోకి తెదేపాను భాజపా […]