Vande Bharat: వందేభారత్‌ @ 50.. సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు

Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్‌ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు […]

Citizenship Amendment Act: ‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’

తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ […]

CAA act India / అమల్లోకి సీఏఏCAA act India /

వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం నియమ నిబంధనలతో నోటిఫికేషన్‌ జారీ లోక్‌సభ ఎన్నికల ముంగిట కీలక పరిణామం న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి […]

The case of Khalistani terrorists.. NIA searches in four states ఖలిస్తానీ టెర్రరిస్టుల కేసు.. నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌లకు సంబంధాల కేసులో నేషనల్‌ ఇన్వేస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల ఎన్‌ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.  పంజాబ్‌లోని మోగా జిల్లాలోని బిలాస్‌పూర్‌ గ్రామంలో, ఫర్దికోట్‌లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్‌ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్‌ మాఫియా మధ్య బలపడుతున్న నెట్‌వర్క్‌లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు […]

Dalapati Vijay About CAA Act / సీఏఏ చట్టం.. దళపతి విజయ్‌ ఏమన్నారంటే?

019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అయితే, సీఏఏ చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ తరుణంలో ప్రముఖ హీరో, దళపతి విజయ్‌ తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ తరుపున స్పందించారు. ఎక్స్‌.కామ్‌ పోస్ట్‌లో సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ప్రకటన చేశారు.  ‘దేశంలోని […]

Don’t leave them.. Geetanjali’s husband / వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన

గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే […]

Janasena: Pawan Kalyan announced MLA candidate ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా […]

Kajal Agarwal shocked : కాజల్‌కు షాకిచ్చిన ఆకతాయి.. ఏం చేశాడంటే

ఆత్రపు పెళ్ళికొడుకు అత్త వెంట పడ్డాడట అన్నట్లుగా తయారైంది కాజల్ పరిస్థితి. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెకు ఓ ఆకతాయి అత్యుత్సాహంతో చేదు ఘటన ఎదురైంది. ఆత్రపు పెళ్ళికొడుకు అత్త వెంట పడ్డాడట అన్నట్లుగా తయారైంది కాజల్ పరిస్థితి. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెకు ఓ ఆకతాయి అత్యుత్సాహంతో చేదు ఘటన ఎదురైంది. దశాబ్ద కాలంగా తెలుగులో దాదాపు అందరు స్టార్లతో సినిమాలు చేసిన చిన్నది ఇక్కడ స్టార్ […]

Fans of top actors who have fight… కొట్టుకున్న అగ్ర నటుల అభిమానులు, ఇదెక్కడి గోలరా బాబూ

బెంగుళూరులో ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ప్రత్యక్షంగా కొట్టుకోవటంతో అసలు ఈ అభిమానుల గొడవ ముందు ముందు ఏటో పోతుందో అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఇంతవరకు సామాజిక మాధ్యమాల్లో మాటలవరకే పరిమితమైన అభిమానులు ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకరినొకరు కొట్టుకోవటం వరకు దారి తీసింది. అగ్ర నటులు ఇక స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అని పరిశ్రమలో అంటున్నారు. అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుండి నేటి […]

Wow.. Is the parking fee a thousand rupees? ..పార్కింగ్ ఫీజు వెయ్యి రూపాయలా? బెంగళూరులోని ఆ మాల్‌కు వెళితే..

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల కలల నగరం. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికితే కళ్లు చెదిరే రీతిలో అద్దెలు కట్టాల్సి ఉంటుంది. మన దేశంలోని బెంగళూరు నగరంలో బతకడం అంటే మాటలు కాదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల కలల నగరం. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికితే కళ్లు చెదిరే రీతిలో అద్దెలు కట్టాల్సి […]