AP Elections Amanchi Krishnamohan.. : కాంగ్రెస్‌లోకి ఆమంచి కృష్ణమోహన్‌.. 

ఆమంచి కృష్ణమోహన్‌ పోటీపై సస్పెన్స్‌ వీడింది. త్వరలో కాంగ్రెస్‌లో చేరి.. చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానంటున్నారు ఆయన. రెండు పార్టీలతో వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అటు.. పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలో టిక్కెట్లు వెతుక్కుంటున్నారు. […]

TDP: TDP Leader Kanna Laxminarayana నీకు ఓటు అడిగే అర్హత ఉందా?… జగన్‌పై కన్నా విసుర్లు

Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్‌ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు. పల్నాడు, ఏప్రిల్ 10: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ […]

AP Politics: ఏపీ రాజకీయ రణరంగంలోకి మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని అంటున్నారు ఆ పార్టీ నాయకులు మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా.. ఆయన ఓ ప్రధాన పార్టీకి ప్రచారం చేయబోతున్నారా.. జనసేన పార్టీ కాదని కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా? అంటే అవుననే […]

BRS : Cantonment Zone BRS Candiate Niveditha : కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత!

హైద‌రాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగ‌త ఎమ్మెల్యే సాయ‌న్న కూతురు నివేదిత‌ను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. బుధవారం పార్టీ ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ నుంచి  గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో లాస్య నందిత సోద‌రి నివేదిత‌ను బీఆర్‌ఎస్‌ బ‌రిలోకి దింపింది. […]

Election Campaign : Young woman kiss during election campaign..ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ అభ్యర్థి!

దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలకు ముమ్మర ప్రచారం సాగుతోంది. పలు పార్టీల నేతలు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్ధులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పోలింగ్‌కు తేదీ సమీపిస్తుండటంతో పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. పశ్చిమబెంగాల్‌లో ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ మరోసారి ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు… ఏప్రిల్‌ 10: దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలకు ముమ్మర ప్రచారం సాగుతోంది. […]

Harish Rao Comments On CM Revanth Reddy : Brs Party : నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్‌ : హరీష్‌ రావు వ్యాఖ్యలు :

సంగారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని హస్తంలాగా తయ్యారైందని ఎద్దేవా చేశారు.  కాగా, హరీష్‌ రావు బుధవారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భండా ఆయన మాట్లాడుతూ..‘ఇటీవల కేసీఆర్‌ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో ఏవోవో వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా […]

Phone tapping case Radhakishan Rao’s remand extended : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం […]

Liqour Scam Case Kejriwal : లిక్కర్‌ స్కాం కేసు: సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ ఎమర్జెన్సీ పిటిషన్‌

లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్‌ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను స్పెషల్‌ మెన్షన్‌ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోరారు. అయితే […]

Supreme Court is again angry on Baba Ramdev ; : బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం

పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు సుప్రీం కోర్టులో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ పిటిషన్‌పై విచారణ పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్‌, బాలకృష్ణ మళ్లీ ఫైర్‌ అయిన ధర్మాసనం భేషరతు క్షమాపణల అఫిడవిట్లను తోసిపుచ్చిన కోర్టు ఏప్రిల్‌ 16న ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగం పైన ఆగ్రహం వెల్లగక్కిన సర్వోన్నత న్యాయస్థానం కరోనిల్‌ కేంద్రం నివేదికపైనా సుప్రీం అసంతృప్తి  కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్‌, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, […]

El Salvador Offering 5000 Free Passports Who Have Highly Skilled Abroad : మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 

విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపరాఫర్‌.. తమ దేశానికి రావాలనుకునేవారికి ఉచిత పాస్‌పోర్టులు అందించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆహ్వానిస్తోంది సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు ఇది బంపరాఫర్‌ అని చెప్పాలి. తమ దేశానికి వచ్చే పలు రంగాలలో నిపుణులైనవారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపరాఫర్‌.. తమ దేశానికి రావాలనుకునేవారికి ఉచిత పాస్‌పోర్టులు అందించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ […]