Gaami: విశ్వక్‌సేన్‌ ‘గామి’పై రాజమౌళి పోస్ట్‌.. ఏమన్నారంటే!

‘గామి’పై దర్శకధీరుడు రాజమౌళి పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీని ట్రైలర్‌పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి (ss Rajamouli) దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో […]

అజయ్‌ దేవగణ్‌ ‘సైతాన్‌’ సెన్సార్‌ బోర్డు ఏం చెప్పిందంటే?

అజయ్‌ దేవగణ్‌ ‘సైతాన్‌’ చిత్రంలో కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించాలని సెన్సార్‌ బోర్డు సూచించింది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn), జ్యోతిక (Jyotika), ఆర్‌.మాధవన్‌ (R.Madhavan) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సైతాన్‌’. ఈ సినిమాను వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించారు. 25 ఏళ్ల తర్వాత జ్యోతిక బాలీవుడ్‌లో చేస్తున్న సినిమా కావడంతో హిందీ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో కొన్ని […]

Kangana Ranaut: ఎంత డబ్బిచ్చినా ఆ పని మాత్రం చేయను: కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా తాజాగా పెట్టిన పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల పెళ్లిల్లో డ్యాన్స్‌లు వేయడం గురించి ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేస్తారు నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనను తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకున్న కంగనా.. డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ‘‘గాయని లతా మంగేష్కర్‌ ఓ ఇంటర్వ్యూలో […]

Teja Sajja: తేజ సజ్జాకు మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ అవార్డు.. ఇది ఆరంభం మాత్రమే అంటూ పోస్ట్‌

మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా తేజ సజ్జా అవార్డు అందుకున్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ సజ్జా (Teja Sajja).. ‘హనుమాన్‌’తో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రంలో హనుమంతు పాత్రతో మెప్పించారు. తాజాగా ఈ యంగ్‌ హీరో మోస్ట్ పాపులర్‌ యాక్టర్‌గా ‘గామా అవార్డు’ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకుంటున్న ఫొటోలను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘దీన్ని హనుమంతుడికి అంకితమిస్తున్నా. ఈ అవార్డు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ‘హనుమాన్‌’కు […]

ప్రశాంత్‌ కిశోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రశాంత్‌ కిశోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ మాటల వెనక […]

‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’

బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు 2014లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశావూ బాబూ! అదే హామీలతో సరికొత్త బీసీ డిక్లరేషన్ పేరుతో బాబు పవన్‌ల కొత్త వేషం బీసీ బిడ్డలు ఇంగ్లీష్ విద్యను ఎందుకు అడ్డుకున్నావు బాబూ బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో ఇంజనీర్లు, డాక్టర్లైన బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న సీఎం జగన్‌ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి: సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతీ హామీని […]

రైతు నష్టపోకూడదు.. అదే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌

అమరావతి: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం […]

‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల […]

Telangana: గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో  గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది.  ఆగస్టు 7.8 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్‌ 21న గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహించనున్నారు. 

బీఆర్‌ఎస్‌కు కోనప్ప గుడ్‌బై..! సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటితో భేటీ

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ నేత, సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్‌లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్‌  ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. […]