The state government should convince the Cannes company : కేన్స్‌ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి KTR

తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలమవుతోంది. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎంతో ప్రయత్నించి ఆ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టేలా ఒప్పించాం. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు 10 రోజుల్లోగా భూమి […]

Indiramma houses for the poor and deserving : పేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో పథకానికి సీఎం శ్రీకారందళితులు, గిరిజనులకు రూ.లక్ష అదనంగా ఇస్తామని భట్టి వెల్లడి పేదల చిరకాల కోరిక.. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవం.. ఇందిరమ్మ ఇల్లు. భద్రాద్రి రాముడు, ఆడబిడ్డల ఆశీర్వాదంతో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు […]

Telangana Cabinet Meeting today : నేడు మంత్రిమండలి సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. స్వయం సహాయక సంఘాల సదస్సు కూడాకీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండడంతో.. ఈ ఎన్నికలకు ముందు జరిగే క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మహిళలకు వడ్డీ లేని రుణ […]

Amit Shah: తెలంగాణలో భాజపాకు 12 కంటే ఎక్కువ స్థానాలు: అమిత్‌షా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన భాజపా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం […]

AP CID CASE ON CHANDRA BABU: చంద్రబాబుపై మరో కొత్తకేసు

రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. 2020 నాటి ఎసైన్డ్‌ భూముల కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ అభియోగపత్రందానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశం అమరావతి: రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ […]

Vande Bharat: వందేభారత్‌ @ 50.. సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు

Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్‌ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు […]

Delhi Encounter: దిల్లీలో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌

Delhi Encounter: ఇటీవల ఓ వ్యక్తి హత్యకు కారణమైన హాశిమ్‌ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్‌ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య దిల్లీలోని అంబేడ్కర్‌ కాలేజీ సమీపంలో రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులకు సైతం […]

CM Jagan is deeply saddened by Geetanjali’s suicide | గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్‌ తీవ్ర విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేవారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం […]

India-China news : అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్‌కు చురకలంటించింది. దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై […]

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్‌ తెలిపింది. దిల్లీ: ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 […]