#Rohit Sharma: Rohit and Akash Ambani angry at Hardik! చిత్తుగా ఓడిన ఎంఐ.. హార్దిక్‌పై మండిపడ్డ రోహిత్‌, ఆకాశ్‌ అంబానీ!

IPL-2024 లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే ఏ దశలోనూ కట్టడి చేయలేక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ముఖ్యంగా ట్రవిస్‌ హెడ్‌(24 బంతుల్లో 62), అభిషేక్‌ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్‌(28 బంతుల్లో 42 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(34 బంతుల్లో 80 నాటౌట్‌) ఊచకోతకు అడ్డుకట్ట వేయలేక ముంబై బౌలర్లు చేతులెత్తేయగా.. […]

Sunrisers’ win: సన్‌ రైజర్స్‌ విజయోత్సాహం: దటీజ్‌ కావ్య మారన్‌, వైరల్‌ వీడియో

పురుషులకే సొంతమనుకున్న క్రికెట్‌లో మహిళలు  తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్‌ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్‌ జట్టు ఓనర్‌గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా  ఇప్పటికే స్పెటల్‌ ఎట్రాక్షన్‌. తాజాగా కావ్య మారన్‌ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు.  […]

IPL 2024:Big shock for Mumbai Indians ఓట‌మి బాధ‌లో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌కు బిగ్ షాక్‌! ఇక క‌ష్టమే

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియ‌న్స్‌ను క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలై బాధ‌లో ఉన్న ముంబైకు మ‌రో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది సీజ‌న్‌లో మ‌రి కొన్ని మ్యాచ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డు ఇప్ప‌టిలో జ‌ట్టుతో చేరేలా సూచ‌నలు క‌న్పించ‌డం లేదు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న‌ సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్ర‌కారం.. సూర్య పూర్తి ఫిట్‌నెస్ […]

Abhinav Gotam movie in OTT.  ఓటీటీకి అభినవ్ గోమటం సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సేవ్ ది టైగర్స్‌ వెబ్ సిరీస్‌తో ఇటీవల అభిమానులను అలరించిన టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. తన కామెడీ పంచులతో సినీ ప్రియులను అలరించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా అభినవ్ హీరోగా నటించిన చిత్రం  మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌ రా. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ […]

Naveen Polishetty: అమెరికాలో యాక్సిడెంట్‌.. హీరో చేతికి ఫ్రాక్చర్‌?!

జాతిరత్నాలు హీరో Naveen Polishetty కి అమెరికాలో యాక్సిడెంట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్‌ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్‌ అయిందట! చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్‌కు దూరంగా ఉండాల్సిందేనన్నమాట! ఈ యాక్సిడెంట్‌ వార్తలపై నవీన్‌ స్పందించాల్సి ఉంది. కాగా నవీన్‌ పొలిశెట్టి చివరగా […]

Viveka Murder Case:  వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. నిందితులు.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌ శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి గురువారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది.

Jagan.. Can you answer these 7 questions?: Chandrababu’s challenge జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్‌

వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. రాప్తాడు: వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబుఅన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్‌.. తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. […]

TDP : Chandrababu to visit Kurnool district.. కర్నూలు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. బహిరంగసభ ఎప్పుడంటే..

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు మార్చి 31న టీడీపీ అధినేత నారా చద్రబాబునాయుడు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఎమ్మిగనూరులో జరగనుంది. అందులో భాగంగా హెలిపాడ్ దగ్గర నుండి రోడ్ షో చేపట్టే అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్ వరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు లోకల్ లీడర్లు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు […]

ANDHRA PRADESH : CM Jagan Bus Yatra సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌ బస్సు యాత్ర..

బస్సు యాత్ర పొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. కొన్ని చోట్ల ప్రజలను కలుస్తున్న సీఎం జగన్ వారిని అప్యాయంగా పలకరిస్తున్నారు. సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. వైసీపీ అధినేత సైతం చాలా చోట్ల తనను కలుస్తున్న వారితో… మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల […]

Mahabubnagar MLC Bypoll: నేడే ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. బరిలో ముగ్గురు అభ్యర్థులు..

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం కానుంది. బ్యాలెట్ పద్ధతిన జరగనున్న ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గోవా శిబిరాలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా నేరుగా పోలింగ్‌బూత్‌లకు తరలివస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పాలమూరులో రసవత్తర పోరు తుది అంకానికి చేరుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట శాసనమండలి ఉపఎన్నికకు నేడు పోలింగ్ జరగబోతోంది. […]