Israel: Ours is a Big mistake.. Accepted Israel.. మాది ఘోర తప్పిదం.. అంగీకరించిన ఇజ్రాయెల్‌.. 

Israel: ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో గాజా పౌరులకు మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం, బ్రిటన్‌.. వివరణ కోరాయి. గాజా: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధంపై ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో.. మానవతా […]

Earthquake in japan, thaiwan :  తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ విపత్తులో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. తైపీ: భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ ‘భూకంప పర్యవేక్షణ సంస్థ’ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా […]

Delhi CM:  Kejriwal rules from jail జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన

ఇక జైల్‌ సే సర్కార్‌ అంటోంది ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌. లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు 15 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. కేజ్రీవాల్‌ను తిహార్‌ జైలుకు తరలించారు. జైలు నెంబర్‌ 2లో ఆయన ఉన్నారు. దీంతో జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన చేస్తారని ఆప్‌ ప్రకటించింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కూడా అదే కారాగారంలో ఉన్నారు. ఇక జైల్‌ సే సర్కార్‌ అంటోంది ఢిల్లీలోని ఆప్‌ […]

Congress Lok Sabha and Assembly candidates in AP. ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే.

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడదుల చేశారు.

TRENDING NEWS : Is this how food is served in Maharaj’s palace? మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!

హోటల్స్‌, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్‌ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్‌ సర్వింగ్‌ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్‌ హోటల్స్‌లో సర్వింగ్‌ విధానమే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష్‌ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు.  ఆ వీడియోలో గాల్వియర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్‌ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా […]

Pakistan Cricket: Pakistani cricketers are given strict training by the army పాక్‌ క్రికెటర్ల కోసం ఆ దేశ సైన్యం తమ క్యాంప్‌లో ఆటగాళ్లకు కఠిన శిక్షణ ఇస్తోంది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొద్ది రోజులుగా భారీ సిక్సర్లు కొట్టడంలో పాకిస్థాన్‌ క్రికెటర్లు (Pakistan Cricket) విఫలమవుతున్నారు. దీనిపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీ (Pak Army)ని రంగంలోకి దింపింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణ (Millitary Training)కు పంపింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో […]

RC17: రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాపై రాజమౌళి కామెంట్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు.    ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. రామ్‌చరణ్‌ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు RC17 గురించి చెప్పారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న […]

Kajal Karthika ott:  ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కాజల్‌, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌: కాజల్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ‘కార్తీక’ పేరుతో గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా AHA లో ఏప్రిల్‌ […]

IPL 2024: ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్.. ఏప్రిల్ 7లోపు కీలక ప్రకటన: టీమిండియా మాజీ క్రికెటర్..

IPL 2024, Hardik Pandya: రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్ల ఓటమితో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి షోలో పాల్గొన్న మనోజ్ తివారీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే హార్దిక్ పాండ్యా రాజస్థాన్‌పై ముంబైకి బౌలింగ్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. IPL 2024, Hardik Pandya: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2024 సీజన్ ఇప్పటివరకు చాలా చెత్తగా మారింది. […]

Kismat Released in OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ ఫిల్మ్.. ‘కిస్మత్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. 

ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్వ్కేర్ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్‏పైకి మరో కామెడీ చిత్రం వచ్చేసింది. టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కిస్మత్. ఫిబ్రవరి 2న ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. విడుదలకు ముందు హడావిడి కనిపించినా.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు […]