Delhi – 13 నుంచి సరి-బేసి విధానం
ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు దిల్లీలో ఈ నెల 13 నుంచి వాహనాలకు సరి-బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివరన సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి అనుమతిస్తారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయులకు ఏడెనిమిది రెట్ల కాలుష్యం […]