Vande Bharat: వందేభారత్‌ @ 50.. సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు

Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్‌ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు […]

CM Jagan is deeply saddened by Geetanjali’s suicide | గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్‌ తీవ్ర విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేవారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం […]

India-China news : అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్‌కు చురకలంటించింది. దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై […]

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్‌ తెలిపింది. దిల్లీ: ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 […]

Criticism of the opposition on the implementation of CAA / సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ […]

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి.  వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం […]

Citizenship Amendment Act: ‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’

తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ […]

Kala Jatheri Marriage: గ్యాంగ్‌స్టర్‌, లేడీ డాన్‌ల పెళ్లికి గ్యాంగ్‌వార్‌ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!

దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్‌లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది.  ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు.  అయితే గ్యాంగ్‌వార్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్‌ గార్డెన్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు.  మ్యారేజ్ గార్డెన్‌లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు […]

Dalapati Vijay About CAA Act / సీఏఏ చట్టం.. దళపతి విజయ్‌ ఏమన్నారంటే?

019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అయితే, సీఏఏ చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ తరుణంలో ప్రముఖ హీరో, దళపతి విజయ్‌ తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ తరుపున స్పందించారు. ఎక్స్‌.కామ్‌ పోస్ట్‌లో సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ప్రకటన చేశారు.  ‘దేశంలోని […]

Don’t leave them.. Geetanjali’s husband / వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన

గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే […]