Gold Price India : బంగారం భగభగలు.. ఆకాశాన్నంటుతున్న ధరలు

దేశంలో పసిడి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైంహైని చేరుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్‌ను దాటింది. మార్కెట్‌ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర […]

Hungry Elephant Viral Video: ఏనుగుకు ఆకలి వేసింది ?

అటవీ సమీప గ్రామాల్లో తరచుగా ఏనుగుల రాక, పంట పొలాలపై ఏనుగుల మంద దాడికి చేయటం, పంటపొలాల్లో విధ్వంసం చేయటం వంటి అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏనుగుకు ఆకలి వేసింది, ఆ తర్వాత ఏనుగు ఆహారంతో ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏనుగు అడవి జంతువు.. అడవిలో కెల్లా అతిపెద్ద శరీరం కలిగినది ఇదే. ఏనుగులు వేల కిలోల బరువును కలిగి ఉంటాయి. గజరాజు […]

Expensive Mushrooms: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..! 

ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు. పుట్టగొడుగులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటిగా పరిగణిస్తారు. డైటీషియన్లు కూడా దాని […]

Tillu Square : Collection బెంచ్‌ మార్క్‌ దగ్గర్లో ‘టిల్లు స్క్వేర్‌’ కలెక్షన్స్‌ :

డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన టిల్లు స్క్వేర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్‌ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్‌కు మించిన ఫన్‌ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్‌ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్‌లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా […]

Tapsee: Tapsee Marriage తాప్సీ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌

తాప్సీ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటి తాప్సీ ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రియుడు మథియాస్‌ బోతోను వివాహమాడారు. మార్చి 20న వీరి ప్రీవెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగింది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో లీకైంది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా […]

Ramayana: Ramayanam movie shooting has started..రామాయణం మూవీ షూటింగ్ షురూ..

ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త టెక్నాలజీల వినియోగంతో ‘రామాయణం’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ బాలీవుడ్‌లో ‘ రామాయణం ‘ సినిమా చేస్తున్నాడు . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇందుకోసం భారీ సెట్లు వేశారు. ఇతిహాసాలు ‘రామాయణం’, ‘మహా భారతం’ ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.. చాలా సీరియల్స్ కూడా వచ్చాయి. ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు […]

Former Mla Shakeel Son : Put the case on the police not on me”“కేసు నా మీద కాదు పోలీసుల మీద పెట్టండి”.. హైకోర్ట్‌లో మాజీ ఎమ్మెల్యే కొడుకు కీలక వాదన

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాగుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత తనకు బదులుగా తన డ్రైవర్‌ను పోలీసుల ముందు లొంగిపోమని చెప్పి ఆ తర్వాత దుబాయ్ పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాగుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ […]

Former MLA Katamreddy Vishuvardhan Reddy : YSRCPలోకి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి

ఎన్నికల ప్రచారం నడుమ అందరినీ కలిసే పరిస్థితి ఉండట్లేదని.. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోవాలని చేరికల కోసం వస్తున్న స్థానిక నాయకుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం ఉదయం ఎనిమిదవ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరిగాయి.   ఎద్దల చెరువు వద్ద బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. సీఎం జగన్‌ విష్ణుకి […]

KTR : కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌నుంచి తీసుకెళ్లారంటూ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

వికారాబాద్ జిల్లా: రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్‌లో  ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా పాత బీఆర్‌ఎస్‌ నేతలేనన్నారు. చెవెళ్లలో కొండా, రంజిత్ రెడ్డి.. మల్కాజిగిరిలో ఈటల, సునీతా.. వరంగల్‌లో ఆరురి, కడియం కావ్య.. ఆదిలాబాద్‌లో నగేష్, భువనగిరిలో బూర.. వీరంతా బీఆర్‌ఎస్‌లో పనిచేసిన వాళ్లేనన్నారు. పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌నుంచి […]

Harish Rao : Selfish people are changing parties. స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు.. 

పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సభలు, సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో గెలుపు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు. ఇవాళ ఆయన భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సభలు, సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో గెలుపు […]