liquor Case : Twist in liquor scam case.. New tension for Kavitha! లిక్కర్‌ స్కాం కేసులో ట్విస్ట్‌.. కవితకు కొత్త టెన్షన్‌!

ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస​ ఎమ్మెల్సీ కవిత తీహార్‌ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.  వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. […]

The pilot who took the family on a flight for the first time..తొలిసారి కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్…

విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్‌ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రదీప్‌ కృష్ణన్‌ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన […]

India Defense Minister’s Warnings : పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: రక్షణమంత్రి హెచ్చరికలు

న్యూఢిల్లీ:  ఉగ్రవాదాన్ని భారత్‌ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ స్పందిస్తూ..  పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్‌ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్‌ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. […]

America Warning To Israel : ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా.. 

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన ఎరెజ్‌ సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం […]

Earthquake In Newyork : భూకంపంతో వణికిన న్యూయార్క్‌

అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది. న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది. ఆకాశహర్మ్యాల్లో ఉంటున్నవారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా వచ్చిన భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం ఉదయం 10.23 గంటలకు […]

Warangal:  నయీంనగర్ నాలా విస్తరణ, కరీంనగర్ రాకపోకలు బంద్..

ఓరుగల్లు మహానగర ప్రజలకు వరద ముప్పు నుండి విముక్తి కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. వరదలకు ప్రధాన కారణమైన నయీంనగర్ నాలా విస్తరణ, బ్రిడ్జి పునః నిర్మాణ పనులు షురూ అయ్యాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల కరీంనగర్ – వరంగల్ మధ్య ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మూడు నెలల పాటు వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్ళాలని సూచిస్తున్నారు. ఓరుగల్లు మహానగర ప్రజలకు వరద ముప్పు నుండి విముక్తి […]

Andhra Elections ” EC ” : ఆంధ్రప్రదేశ్‎లో .. ఈసీకి భారీగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‎లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నాటి నుంచి ప్రత్యేక బృందాలతో ఎక్కడ ఎలాంటి గొడవలు గాని, హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వాటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తక్షణమే చర్యలు […]

Congress: Caste conflict in T-Congress..Congress: టి-కాంగ్రెస్‎లో కులం కుంపటి..

లోక్ స‌భ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ కాంగ్రెస్‎లో అసంతృప్తులు పెరుగుతున్నారు. జ‌న‌ర‌ల్ స్థానాల్లోని నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌య‌ట పెట్ట‌న‌ప్ప‌టికీ.. ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాల్లో మాత్రం ర‌గిలిపొతున్నారు. తెలంగాణ‌లో ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాలు మూడు ఉన్నాయి. అందులో క‌నీసం రెండు స్థానాలు త‌మకు కేటాయించాల‌ని మాదిగ సామాజికవ‌ర్గం డిమాండ్ చేసింది. తెలంగాణ‌లో సుమారు 80 ల‌క్ష‌ల మంది మాదిగ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లున్నారు. మాల సామాజిక వ‌ర్గ ఓట్లు 17 ల‌క్షల వ‌ర‌కు ఉంటాయి. అందుకే పార్టీలు […]

KTR : కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” అని పేర్కొన్నారు : కేటిఆర్.

కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” అని పేర్కొన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై మాజీ మంత్రిపై మండిపడ్డారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” అని పేర్కొన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై మాజీ మంత్రిపై […]

Phone Tapping:   ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి నల్లగొండలోనే వార్ రూమ్ సెంటర్‌ నిర్వహించి ట్యాపింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ప్రకంపనలు రేపుతోంది. సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌ […]