Criminal Case On Sajjala :సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు…

వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్‌ కేసు నమోదైంది. అమరావతి: వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్ కేసు నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై […]

AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara rao)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను […]

Union Home Minister Amit Shah visited Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్‌షాకు శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో అందజేశారు.

SoniaGandhi attend telangana foramation day celbration:  అవతరణ వేడుకలకు సోనియా గాంధీ….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జూన్‌ 2న ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపారు. ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను […]

Cheating Black Magic: Police Raids Simultaneously On The Houses Of Fake Baba :దొంగ స్వాముల ఇళ్ళపై ఏకకాలంలో పోలీసుల దాడులు

మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దొంగ స్వాముల భరతం పట్టారు పోలీసులు. ఏకంగా బైండోవర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దాడి చేశారు. మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై […]

Kalki 2898 AD Movie Trailer Will Release On June 7th : కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజే విడుదల..

రూ. 600 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల భైరవ స్నేహితుడైన బుజ్జి రోబోటిక్ కారును పరిచయం చేశారు మేకర్స్. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సందడి చేస్తుంది బుజ్జి కారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 […]

Telangana’s 10th Anniversary Celebrations : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు..

జూన్‌ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్స్‌ చేస్తున్నారు పోలీసులు. జూన్‌ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్స్‌ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో […]

Actor Vijay Sethupathi Attended His Fans Marriage : అభిమానుల పెళ్లి.. స్వయంగా కలిసి ఆశీర్వదించిన స్టార్ హీరో.. 

అగ్ర కథానాయికుడు అయినా నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్. స్టార్ డమ్‏తో ఎలాంటి సంబంధం లేకుండా సింపుల్ లైఫ్ గడిపేస్తుంటాడు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా తన అభిమాని పెళ్లిలో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోలో పంచెకట్టులో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో […]

Agnibaan: అగ్నిబాణ్‌ విజయవంతం

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. రెండు నిమిషాలపాటు సాగిన ఈ ప్రయోగం స్వదేశీ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో సాధించిన గొప్ప విజయం. ఇది ఒక ప్రధాన మైలురాయి అని పేర్కొంటూ చెన్నై […]