‘Teesta’ Floods : సిక్కిం నుంచి బెంగాల్‌కు

కుంభవృష్టితో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) ఇంకా వరద (Floods) గుప్పిట్లోనే ఉంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన అతి భారీవర్షానికి తీస్తా నది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరద (Flash Floods) పోటెత్తింది. ఈ వరదల్లో మృతుల సంఖ్య 14కు పెరగ్గా.. మొత్తం 102 మంది గల్లంతయ్యారు. ఇందులో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గల్లంతైన […]

Tensions between Canada – India – కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలు

భారత్‌లో ఉన్న దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని దిల్లీ అల్టిమేటం జారీ చేయడంపై కెనడా స్పందించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తమ దౌత్యవేత్తల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమయంలో భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తామని చెప్పింది. ‘‘భారత్‌లో ఉన్న మా దౌత్యవేత్తల భద్రతను కెనడా ప్రభుత్వం చాలా కీలకంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వంతో మేము సమన్వయంతో ఉంటాము. ఆ […]

China : ప్రమాదానికి గురైన జలాంతర్గామి

ఎల్లో సముద్ర జలాల్లో చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి ప్రమాదానికి గురై అందులోని 55 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సబ్‌మెరైన్లు తమ క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ప్రాంతంలోకి ప్రవేశించకుండా సముద్రం అడుగున చైనా నిర్మించిన గొలుసుల ఉచ్చులోనే ఆ దేశ జలాంతర్గామి చిక్కుకుని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై బ్రిటన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎల్లో […]

Russia : ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 31 డ్రోన్‌లను కూల్చివేసింది

ఉక్రెయిన్‌ చేసిన భారీ డ్రోన్ల దాడిని విఫలం చేశామని రష్యా పేర్కొంది. తమ సరిహద్దు ప్రాంతాలకు కీవ్‌ పంపిన 31 డ్రోన్లను.. తమ గగనతల రక్షణ వ్యవస్థ నేలకూల్చిందని తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత తమ సరిహద్దులపై ఉక్రెయిన్‌ చేసిన అతి పెద్ద దాడి ఇదేనని చెప్పింది. మరోవైపు ఫ్రాన్స్‌కు పారిపోయిన రష్యా పాత్రికేయురాలు మరీనా ఒవస్యానికోవాకు మాస్కో న్యాయస్థానం బుధవారం ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. రష్యా అధికారిక ఛానల్‌ వన్‌లో పనిచేసిన మరీనా.. ఉక్రెయిన్‌పై […]

Pakistan: అఫ్గాన్‌ సైనికుడి కాల్పుల్లో ఇద్దరు పాక్‌ పౌరులు మృతి

పాకిస్థాన్‌ (pakistan), అఫ్గానిస్థాన్‌ (afghanistan) సరిహద్దు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. అఫ్గాన్‌ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్‌ పౌరులు మృతి చెందారు. అందులో 12 ఏళ్ల బాలుడున్నాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన బెలూచిస్థాన్‌లోని ఫ్రెండ్షిప్‌ గేట్‌ (friendship gate)గా పిలిచే చామన్‌ సరిహద్దు (chaman border) వద్ద చోటు చేసుకుంది. ఈ సరిహద్దు గేటు నుంచే అఫ్గాన్‌ పౌరులు పాకిస్థాన్‌లోకి రాకపోకలు సాగిస్తుంటారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో […]

Vande Bharat : కాషాయ రంగులో

ఇటీవల కేరళలో ప్రారంభమైన వందేభారత్‌ (Vande Bharat) రైలుకు కాషాయ రంగు ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ‘మనుషుల కళ్లకు రెండు వర్ణాలు బాగా కన్పిస్తాయి. ఒకటి పసుపు కాగా.. రెండోది ఆరెంజ్‌ రంగు. యూరప్‌లో దాదాపు 80 శాతం రైళ్లపై ఆరెంజ్‌ లేదా పసుపు, ఆరెంజ్‌ రంగులు కలగలిసి ఉంటాయి’ […]

TEJAS :వైమానిక దళంలోకి ట్విన్‌ సీటర్‌

 హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌ ట్విన్‌ సీటర్‌ బుధవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లోకి హుందాగా అడుగుపెట్టింది. సమకాలీన యుద్ధ అవసరాలకు అనువుగా తయారైన ఈ యుద్ధ విమానం నమూనాను బెంగళూరులో వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరికి హెచ్‌ఏఎల్‌ సీఎండీ సి.బి.అనంతకృష్ణన్‌ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన […]

Abhishek Singh : సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా

ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని  ధ్రువీకరించారు. నటన, మోడలింగుపై ఉన్న ఆసక్తితో అభిషేక్‌ ఇప్పటికే కొన్ని సినిమాలకు పనిచేశారు. సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. ఉన్నతాధికారులు ఆ వ్యవధిని 2018లో మరో రెండేళ్లు పెంచారు. అభిషేక్‌ ఆ సమయంలో మెడికల్‌ లీవ్‌ తీసుకొని విధులకు దూరంగా ఉన్నారు. […]

Rahul Gandhi’s surprise : సోనియాగాంధీకి బహుమతి

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి ముద్దులొలికే బుజ్జి కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. గత ఆగస్టు నెలలో గోవాలో పర్యటించిన రాహుల్‌ ‘జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌’ జాతికి చెందిన ఆడ కుక్కపిల్లను తనతోపాటు దిల్లీకి తీసుకువచ్చారు. కుక్కపిల్లను ఓ అట్టపెట్టెలో పెట్టి సోనియా ముందుంచి తెరవమని కోరారు. పెట్టెను తెరచిన వెంటనే ఆమె ముఖంలో ఎనలేని సంతోషం కనిపించింది. కుక్కపిల్లను అమాంతం ఎత్తుకొని, కుమారుడు రాహుల్‌ను ప్రేమగా హత్తుకున్నారు. ఈ కుక్కపిల్లకు ‘నూరీ’ […]

MBBS- ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థుల ఇంత్యూజియా ఫెస్ట్‌ ప్రారంభమైంది….

పాలమూరు:మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS మెడికల్ స్టూడెంట్స్ ఇంటూజియా ఫెస్ట్ 2019 ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు కొనసాగుతాయి. మంగళవారం మహబూబ్‌నగర్‌ సమీపంలోని తిరుమల హిల్స్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటూజియా ఫెస్ట్‌ లోగోను డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌, జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవన్‌, తదితరులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఇంటూజియా ఫెస్ట్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులు ఆటలు, టోర్నమెంట్‌లను రూపొందించుకోవాలని […]