United States of America (USA) – టర్కీకి చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది

పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO) సభ్యదేశం తుర్కియే(Turkey)కు చెందిన డ్రోన్‌ను అమెరికా(USA) కూల్చివేసింది. సిరియా(Syria)లో మోహరించిన అమెరికా బలగాలు.. తమ క్యాంప్‌ వైపునకు డ్రోన్‌ రావడంతో ముప్పుగా భావించి యూఎస్‌ ఫైటర్‌ జెట్లతో కూల్చివేశాయి. ఈ విషయాన్ని పెంటగాన్‌ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం అంకారాలోని తుర్కియే పార్లమెంట్‌ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ ప్రకటించింది. […]

Rocket Attack : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశ తూర్పు ప్రాంతం ఖర్కివ్‌లోని హ్రోజా గ్రామంలో కెఫేపై గురువారం జరిగిన రాకెట్‌ దాడిలో సుమారు 50 మంది పౌరులు మృతి చెందారు. ఆ సమయానికి కెఫేలో 60 మంది వరకూ ఉన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అతిపెద్ద ప్రాణనష్టం ఇదే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఘటనను ధ్రువీకరించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడూ ఉన్నట్లు స్థానిక గవర్నర్‌ వెల్లడించారు. దాడికి ఉపయోగించింది ఇస్కందర్‌ క్షిపణిగా గుర్తించారు. ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలోని […]

Syria Drone attack – 100మందికి పైగా మృతి!

సిరియా(Syria)లో మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్‌ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 125 మంది గాయపడ్డారు. హోమ్స్‌ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్‌ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. చనిపోయిన వారిలో మిలిటరీ క్యాడెట్స్‌ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులుగానీ, జిహాదిస్టులు గానీ, ఈ దాడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్‌ డేను లక్ష్యంగా […]

Snake – హెల్మెట్‌లో దూరిన ఘటన

బైక్‌పై లాక్‌ చేసి ఉంచిన హెల్మెట్‌లోకి నాగుపాము(Snake hides inside helmet) దూరిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. పుతూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్‌ సోజన్‌.. తాను పని చేసే చోట బైక్‌ను పార్క్‌ చేసి, దానికి హెల్మెట్‌ను లాక్‌ చేసి ఉంచాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ముందుగా హెల్మెట్‌ను తీస్తుండగా, ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి పరిశీలించి చూస్తే లోపల చిన్న పాము కనిపించింది. హడలిపోయిన అతడు […]

Avalanche tragedy – ఏడాది తర్వాత దొరికిన పర్వతారోహకుడి మృతదేహం

ఉత్తరాఖండ్‌లోని ద్రౌపదీ కా డాండా పర్వత శిఖర మార్గంలో గతేడాది అక్టోబరులో జరిగిన హిమపాత విషాదంలో మరణించిన వినయ్‌ పన్వర్‌ మృతదేహాన్ని గురువారం గుర్తించారు. 29 మంది పర్వతారోహకులను బలిగొన్న నాటి మహా విషాదంలో నెల రోజుల గాలింపు ద్వారా 27 మృతదేహాలను కనుగొన్నారు. గల్లంతైన మిగతా ఇద్దరిలో వినయ్‌ మృతదేహం కూడా దొరకడంతో, లెఫ్టినెంట్‌ కర్నల్‌ దీపక్‌ వశిష్ట్‌ ఆచూకీ ఇక తెలియాల్సి ఉంది. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (ఎన్‌ఐఎం) బృందం ద్రౌపదీ కా […]

Fire Accident – ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయిలో గోర్‌గోన్‌ ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 30మందికిపైగా గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Shraddha Kapoor : మహదేవ్ బెట్టింగ్ యాప్..

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం బాలీవుడ్‌ (Bollywood)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), హాస్యనటుడు కపిల్‌ శర్మ, […]

BRS : భారాసలోకి నందికంటి శ్రీధర్‌

భారాసలో అధిష్ఠానమంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని, తమకు దిల్లీలో బాసులెవరూ లేరని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మేడ్చల్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ బుధవారం తన అనుచరులతో కలిసి భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసిన శ్రీధర్‌కు అక్కడ అన్యాయం జరిగిందని,  భారాసలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఆయనకు, ఆయనతో పాటు వచ్చిన అనుచరులకు […]

BRS : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి.. పార్టీకి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి.. భారాస(BRS) పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మనోహర్ రెడ్డి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరు కానున్నారు. మనోహర్ రెడ్డికి కాంగ్రెస్‌ తరఫున […]

Kadapa : భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి ఆపై కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కడపలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్‌ నుంచి పిస్తోలు తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.  విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్‌ ఇలా చేయడానికి […]