Mumbai-Ahmedabad – హైస్పీడ్‌ రైలు తొలి సొరంగం తవ్వకం

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో భాగంగా గుజరాత్‌లోని జరోలీ గ్రామంలో 350 మీటర్ల పొడవైన పర్వత సొరంగం తవ్వకం పనులను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ద నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  మరో ఆరు సొరంగాలను తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తిస్థాయిలో ఈ మార్గం అందుబాటులోకి వస్తే 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ఇక ఇదే మార్గంలో ఉన్న సూరత్‌లో జాతీయ […]

Sikkim Floods – తీస్తా నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు

తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. సిక్కింతోపాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కింలో ఏర్పాటుచేసిన సైనిక శిబిరాలు ఆకస్మిక వరదలకు కొట్టుకుపోవడంతో సైన్యానికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీస్తా నదిలో బెంగాల్‌ దిశగా కొట్టుకువస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయీగుడీ జిల్లాలో ఇలా కొట్టుకొచ్చిన మోర్టార్‌ షెల్‌ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో […]

Chemical gas release – కార్మికుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిసర ప్రాంతంలోని పరిశ్రమలో ప్రమాదవశాత్తు రసాయన వాయువు విడుదలై ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన శివరాత్రి కృష్ణ (25) ఏడాది కాలంగా సెక్టార్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పరిశ్రమలోని రియాక్టర్ల వద్ద వాల్వ్‌లో పొరపాటున తెరుచుకోవడంతో రసాయన వాయువులు గణనీయమైన స్థాయిలో విడుదలయ్యాయి. గ్యాస్‌ పీల్చడంతో కృష్ణ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి […]

Revanth Reddy – మంత్రి కాలేరని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: ఎంపీ అరవింద్ చెప్పినట్టు పసుపు బోర్డు ఎక్కడ ఉన్నదో మీకు తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భయపడాల్సిన అవసరం లేదు. పసుపు బోర్డు చేస్తున్న ఆపరేషన్లు రేవంత్ రెడ్డికి తెలియడం లేదు. రేవంత్ రెడ్డికి ఏనాడూ మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఆయన ఎప్పటికీ మంత్రి పదవికి వెళ్లరు.ఈ మేరకు ఎంపీ అరవింద్ మీడియా ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చర్యలను ఖండించారు. పసుపు పంటను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్నారు. చెరకు ఫ్యాక్టరీలను తెదేపా […]

‘Kantara’ -‘కాంతారా’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది….

‘కాంతారా’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రత్యేక ట్వీట్‌లో ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్:హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై త్వరగా హిట్ అయింది. 15 రోజుల్లో తెలుగులో అదే టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా దేశంలో కూడా ఊహించని విజయం సాధించింది. ఇది బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం విడుదలై […]

OMG 2 Ott release.. – OMG 2 Ott విడుదల..

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించే నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar). ఆయన దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇటీవల ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) విడుదలైంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ […]

‘Month of Madhu’ – ‘మంత్‌ ఆఫ్‌ మధు’

నవీన్‌ చంద్ర, స్వాతి జంటగా శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. యశ్వంత్‌ ములుకుట్ల నిర్మించారు. శ్రేయ, హర్ష, మంజుల ఘట్టమనేని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ఈనెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర ట్రైలర్‌ చూసినప్పుడే ఫీల్‌ గుడ్‌ మూవీ […]

MAD – ‘మ్యాడ్‌’ ట్రైలర్‌ చూశారా!

సంగీత్‌ శోభన్‌, నార్నె నితిన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్‌’ (MAD). ఇంజినీరింగ్‌ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి. 

‘Devara’ – ‘దేవర’

కథానాయకుడు ఎన్టీఆర్‌.. దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేగంగా చిత్రీకరణ చేసుకుంటోన్న ఈ సినిమా తాజాగా ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా సముద్రంలో రాత్రి పూట జరిగే ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఈ ఫైట్‌కు సోలమన్‌ నేతృత్వం వహించారు. ఈ సినిమా కోసం […]

Rajinikanth – వీడియో వైరల్‌

ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ముందు వరుసలో ఉంటారు. అలాగే తన అభిమానులను ఆయన ఎంతగా ఆదరిస్తారో కూడా తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌ తన 170వ (Thalaivar 170) చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ కేరళలోని తిరువనంతపురంలో తాజాగా ప్రారంభమైంది. ఆ చిత్రీకరణలో రజనీకాంత్ పాల్గొంటున్నారని తెలిసిన అభిమానులు వందలమంది లొకేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఆయన వాళ్లందరికీ […]