Google – క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోండి..

గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారులను కేంద్ర ప్రభుత్వ సైబర్‌ భద్రత సంస్థ- ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌)’ అప్రమత్తం చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే.. వెంటనే దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. పాత బ్రౌజర్‌లో లోపాలు ఉన్నాయని, ఫలితంగా సైబర్‌ నేరగాళ్లు రిమోట్‌గా కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేసుకునే ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది.

India – ఫేస్‌బుక్‌, గూగుల్‌ సీఈవోలకు లేఖ..

భారత్‌లో ఇది ఎన్నికల తరుణమైనందున మత విద్వేషాలకు ప్రోత్సాహం ఇవ్వకుండా, ప్రజాస్వామ్య పోరులో తటస్థ వైఖరిని పాటించాలని కోరుతూ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పించాయ్‌లకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి లేఖలు రాసింది. సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ భారత్‌లో అధికారపక్షమైన భాజపాకు, నరేంద్ర మోదీ పాలనకు మద్దతుగా పక్షపాతం చూపుతున్నట్లు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ లేఖలు తెర మీదకు వచ్చాయి. ఏఐసీసీ అధ్యక్షుడు […]

Medak – వివిధ ప్రాంతాల నుంచి 15 లక్షల నగదు పట్టివేత

పటాన్‌చెరు:ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. వివిధ ప్రాంతాల నుంచి 15 లక్షలు. నగదు ఉన్న మూడు కార్లు మొత్తం రూ. పటాన్చెరు తనిఖీల్లో రూ.9.95 లక్షలు పట్టుబడ్డాయి. కేపీహెచ్‌బీకి చెందిన కోటిరెడ్డి రూ. 5 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన హేమంతవర్మ రూ. 2.25 లక్షలు, తేలపూర్ణకు చెందిన రామకృష్ణ రూ. 1.60 లక్షలు, బీరంగూడకు చెందిన రాజ్‌కుమార్‌ రూ. ఆటోమొబైల్‌లో 1.10 లక్షలు. రామచంద్రాపురం టోల్‌గేట్‌తో పాటు మరో రెండు చోట్ల […]

Nalgonda – బాలికా హక్కులపై బాలికలకు అవగాహన కల్పించారు

భువనగిరి;బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల హక్కులు, రక్షణ, బాల్య వివాహాల నిషేధం వంటి అంశాలతో కూడిన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ పథకం, ఆడపిల్లల రక్షణ తదితర అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మారుతీదేవి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ అధ్యక్షురాలు, కార్యదర్శి, భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కె. మురళీమోహన్. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్ కోడారి వెంకటేశం, […]

‘Vidhi’ – రోహిత్‌ నందా, ఆనంది జంటగా

రోహిత్‌ నందా, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. ఎస్‌.రంజిత్‌ నిర్మించారు. ఈ సినిమా నవంబరు 3న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో హీరో విష్వక్‌ సేన్‌ ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిర్మాత రంజిత్‌ నాకు మంచి మిత్రుడు. నాకూ తనలాంటి బ్రదర్‌ ఉంటే బాగుండనిపిస్తుంది. ఆనంది ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. ఎంతో ప్రాధాన్యత […]

Movie : ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’

వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిసెంబరు 8న విడుదల కానున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్రబృందం. భారతదేశంలోని వైమానిక దళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోని పిక్చర్స్‌ ఇంటర్నేషన్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌పై సందీప్‌ ముద్దా నిర్మిస్తున్నారు. ఫైటర్‌ పైలట్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు వరుణ్‌.

‘Aadipurush’ – ఎన్నో వివాదాలను ఎదుర్కొంది

ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పాత్రల వేషధారణ మొదలుకొని సన్నివేశాల్లో వాడిన భాష, చిత్రీకరించిన ప్రదేశాలపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ సినిమాపై కొందరు కోర్టుకెక్కారు. మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో నిర్మాతలపై పలు కేసులు పెట్టారు. తాజాగా వాటన్నింటినీ కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. ‘ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు […]

Nagarjuna – వందో సినిమా సన్నాహాలు

నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనకిది 99వ సినిమా. ఇది పూర్తయ్యేలోపే 100వ సినిమాపై స్పష్టత ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సరైన కథ వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. నిజానికి ఈ వందో చిత్రం కోసం మోహన్‌ రాజా కథ సిద్ధం చేశారని.. దీంట్లో నాగ్‌, అఖిల్‌ కలిసి నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ కోసం నవీన్‌ అనే తమిళ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే […]

Akshay Kumar – రూమర్స్‌ని ఖండించారు….

తనపై వస్తున్న రూమర్స్‌ను బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ఖండించారు. ఆయన మళ్లీ పాన్‌ మసాలా ప్రకటనలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన అక్షయ్‌.. వివరణ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అక్షయ్‌ కుమార్‌ గతంలో నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన సోషల్‌ మీడియాలో తాజాగా షేర్‌ అవుతోంది. దీంతో ఆయన మళ్లీ ఆ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన […]

Trudeau – UAE అధ్యక్షుడు, జోర్డాన్‌ రాజుతో ‘భారత్‌’పై చర్చ..

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ దిల్లీతో కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘‘చట్టాలను సమర్థించడం, గౌరవించడం’పై ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది. అంతేగాక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌, జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతో  ‘భారత్‌-కెనడా దౌత్య వివాదం’ పై ట్రూడో చర్చించారు. ‘‘యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ […]