Lok Sabha – లాగిన్ వివరాలను వ్యాపారవేత్తకు అందించారు
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ఆదివారం సంచలన ఆరోపణలు గుప్పించిన భాజపా ఎంపీ నిషికాంత్ దుబే తాజాగా తన స్వరం మరింత పెంచారు! మొయిత్రా లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ వివరాలను (క్రెడెన్షియల్స్) ఓ వ్యాపారవేత్తకు అందజేశారని సోమవారం ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ‘‘లోక్‌సభ వెబ్సైట్లో తన లాగిన్ వివరాలను ఎంపీ మొయిత్రా.. వ్యాపారవేత్త హీరానందానీ, ఆయన […]