Israel-Hamas : గాజా ఆసుపత్రిపై దాడి

ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో విలవిల్లాడుతున్న గాజా (Gaza)లో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకొంది. అల్‌ అహ్లి ఆసుపత్రి (Attack on Hospital)లో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాగా.. ఈ దారుణానికి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమని హమాస్‌ (Hamas) ఆరోపించగా.. దాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఖండించారు. అది ఉగ్రమూకల దుశ్చర్యే అని దుయ్యబట్టారు. ఐడీఎఫ్‌ కాదు: నెతన్యాహు ‘‘ఈ […]

Cancer – మెరుగైన వైద్యం

క్యాన్సర్‌ బాధితులకు తక్కువ ఖర్చులో, వేగంగా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ఆవిష్కరణ చేపట్టారు. క్యాన్సర్‌ కణాలను సులభంగా అధ్యయనం చేసేందుకు త్రీడీ ముద్రిత విధానంలో కణితి నమూనాలను సృష్టించే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం అత్యాధునిక బయోప్రింటింగ్‌ సాంకేతికతలతోపాటు మైక్రోఫ్లూయిడిక్‌ చిప్‌లను ఉపయోగించారు. సంప్రదాయబద్ధ బయాప్సీ విధానంలో 2డీ కణితి నమూనాలు అందుబాటులో ఉంటాయని, వాటిని లోతుగా పరిశీలించడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన […]

ISRO – శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2035 కల్లా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవడం, 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపడం వంటి సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకొని కృషిచేయాలని సూచించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో తొలిసారిగా తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్‌’ మిషన్‌లో భాగంగా తొలి క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను ఈ నెల 21న పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో […]

National Film Awards : ఉత్తమనటుడిగా అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నారు

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా ‘పుష్ప’ సినిమాకు టాలీవుడ్‌ ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ (పుష్ప) అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్‌ (గంగూభాయి కాఠియావాడి), […]

Minister Puvvada Ajay – వచ్చే ఎన్నికల్లో 88-90 స్థానాలు గెలుస్తాం..

భారాస మేనిఫెస్టోతో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కొట్టుకుపోయాయని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఖమ్మం భారాస కార్యాలయంలో అభ్యర్థుల మీడియా సమావేశంలో  మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారాస సర్కార్‌ అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రంలోని భాజపా సర్కార్‌ కూడా కాపీ కొట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని మంత్రి అజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Maharastra – రైలు ప్రమాదం..

మహారాష్ట్రలో ఓ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం మధ్యాహ్నం అహ్మద్‌నగర్‌ నారాయణ్‌పుర్‌ స్టేషన్ల మధ్య 8 బోగీల డెము రైల్లో  భారీగా మంటలు చేలరేగాయి. ఐదు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం సంభవించలేదని, గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించగానే రైలులో ఉన్నవారిని కిందకు దించినట్లు చెప్పారు.

Daniel Noboa – ఈక్వెడార్‌ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త

ఈక్వెడార్‌ నూతన అధ్యక్షుడిగా యువ వ్యాపారవేత్త 35 ఏళ్ల డేనియెల్‌ నొబోవా ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రత్యర్థి గొంజాలెజ్‌పై విజయం సాధించారు. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో నొబోవాకు 52%, గొంజాలెజ్‌కు 42% ఓట్లు లభించాయి. నొబోవా తండ్రి అల్వారో నొబోవా ఈక్వెడార్‌లోనే అత్యంత సంపన్నుడు. ఆయన 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తండ్రి సాధించలేనిది ఇప్పుడు కుమారుడు సాధించారు. అంతేకాదు.. 35 ఏళ్ల డేనియల్‌.. ఈక్వెడార్‌ అధ్యక్ష పీఠాన్ని […]

Israel – హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడులు..!

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా(Hezbollah)కు చెందిన కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం నేడు దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ ఎక్స్‌ ఖాతాలో కూడా ధ్రువీకరించింది. లెబనాన్‌ నుంచి గత కొన్నాళ్లుగా తరచూ దాడులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా..  రాజకీయ, సైనిక, సామాజిక కార్యక్రమాల్లో చాలా బలంగా ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమాయక ప్రజలపై దాడి చేసిన హమాస్‌కు ఇది మద్దతు ప్రకటించింది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ […]

War – హమాస్‌, ఇజ్రాయెల్‌ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా

హమాస్‌, ఇజ్రాయెల్‌ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో ముప్పేట దాడి ముప్పు ముంచుకొస్తోంది. ఇటు గాజా నుంచి హమాస్‌ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను చేస్తూనే ఉంది. గాజా సరిహద్దుల్లో బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇటు లెబనాన్‌వైపూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్‌ ఏర్పాటుచేసిన నిఘా కెమెరాలను హెజ్‌బొల్లా ధ్వంసం చేస్తోంది. ఒకవేళ గాజాలో భూతల దాడులకు దిగితే తామూ యుద్ధంలోకి వస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. మరోవైపు గాజాలో ప్రజల […]

UGC – వాట్సప్‌ ఛానల్‌ను ప్రారంభించింది

ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు, విద్యాసంస్థలకు అందించడానికి వీలుగా యూజీసీ సోమవారం వాట్సప్‌ ఛానల్‌ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు విద్యాసంస్థలకు రియల్‌టైమ్‌లో సమాచారం అందుతుందని పేర్కొన్నారు.