Fake Heart Attack – 20కి పైగా రెస్టారెంట్లకు టోపీ..

గుండెపోటు (Heart Attack) నాటకమాడి తాను తిన్న ఆహారానికి డబ్బులు చెల్లించకుండా వరుస రెస్టారెంట్‌లను ఏమారుస్తున్న ఓ ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. స్పెయిన్‌ (Spain)లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్పెయిన్‌లో గత కొన్ని రోజులుగా కొన్ని రెస్టారెంట్ల సిబ్బందిని తప్పుదోవ పట్టిస్తూ బిల్లు ఎగ్గొడుతున్నాడు. నచ్చిన ఆహారాన్ని తిని… తీరా బిల్లు కట్టే సమయంలో […]

Rishi Sunak – ఉగ్రవాదంపై పోరులో మేం ఆ దేశం వెంటే

హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం (Israel Hamas conflict) కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (British PM Rishi Sunak) ఇజ్రాయెల్‌ పర్యటన చేపట్టారు. గురువారం ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా టెల్‌అవీవ్‌లో దిగిన ఆయన.. ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ కానున్నారు. హమాస్‌తో పోరు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌కు సునాక్‌ మద్దతు ప్రకటించారు. ‘‘నేను ఇజ్రాయెల్‌లో ఉన్నాను. ఈ దేశం బాధలో ఉంది. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ […]

Gaza – ఆసుపత్రి బాధితులకు మలాలా రూ.2.5 కోట్లు

గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిపై రాకెట్‌ దాడి జరగడంపై నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ వేళ పాలస్తీనా ప్రజలకు సాయం చేస్తున్న మూడు స్వచ్ఛందసంస్థలకు తన వంతుగా 3 లక్షల డాలర్లు (రూ.2.5 కోట్లు) విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేశారు. ‘‘గాజాలోని అల్‌ – అహ్లి ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిని చూసి భయపడ్డా. ఈ చర్యను నిస్సందేహంగా […]

France – విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

 ఫ్రాన్స్‌లో ఒకేసారి పలు విమానాశ్రయాలకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆయా ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయించిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఈ బెదిరింపులు రావడం గమనార్హం. ఫ్రాన్స్‌లో లిల్లె ఎయిర్‌పోర్టుకు తొలుత బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది విమానాశ్రయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే బ్యూవైస్‌, […]

Israel-Hamas – హమాస్‌ ఆర్థిక మూలాలపై గురి..

ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు (Israel Hamas conflict) కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది. హమాస్‌ కీలక సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలువురి హమాస్‌ సభ్యుల బృందంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు గాజా, సుడాన్‌, తుర్కియే, అల్జీరియా, ఖతర్‌లలో ఉన్న హమాస్‌ సభ్యుల ఆర్థిక మూలాలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ట్రెజరీ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో […]

Suspension – ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచిన ఎస్‌.ఐ.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచిన ఎస్‌.ఐ. సోమనాథ్‌.. ఉన్నతాధికారులు తనపై తీసుకొన్న క్రమశిక్షణ చర్యతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్‌ మానే ధ్రువీకరించారు. మహారాష్ట్రలోని పింప్రీ – ఛించ్వాడ్‌ పోలీస్‌ కమిషనరేటులో పనిచేసే సోమనాథ్‌ అక్టోబరు 10న విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్‌ – బంగ్లాదేశ్‌ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని తెలిపారు. ఆయనపై తదుపరి […]

Supreme Court – ఈడీ అధికారాలపై మా తీర్పును అవసరమైతే పునఃసమీక్షిస్తాం

హవాలా కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అరెస్టులకు, ఆస్తుల అటాచ్‌మెంటుకు ఈడీకి అధికారాలు ఉంటాయంటూ 2022లో తాము ఇచ్చిన తీర్పును అవసరమైతే పునఃసమీక్షిస్తామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం దీనిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి సంబంధించిన పలు అంశాలను త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే పరిష్కరించినట్లు పేర్కొంది. ఇందులో ఎక్కడైనా పునరాలోచన అవసరమా అన్నదే ఇపుడు ముఖ్యమైన అంశమని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బేలా […]

America President – జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో

ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం (Israel Hamas conflict) కొనసాగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఇజ్రాయెల్‌ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా టెల్‌అవీల్‌లో దిగిన బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యూహు (Benjamin Netanyahu), అధ్యక్షుడు ఇసాక్‌ ఎర్జోగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడిన బైడెన్‌.. హమాస్‌ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారని అన్నారు. ఇటువంటి సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న పోరుకు అమెరికా మద్దతుగా […]

‘Ujjwala’ beneficiaries – ఓ గ్యాస్‌ సిలిండర్‌ ఉచితం

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ‘ఉజ్వల యోజన’ పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారందరికీ దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని మంగళవారం ప్రకటించారు. బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఈ మేరకు వెల్లడించారు.

Type 2 Diabetes – పగటి కాంతితో చికిత్స

సహజసిద్ధమైన పగటి వెలుగులో ఎక్కువసేపు గడపడం వల్ల టైప్‌-2 మధుమేహానికి చికిత్స చేయవచ్చని నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ రుగ్మత దరిచేరకుండా చూసుకోవడానికీ ఇది దోహదపడొచ్చని తేలింది. పగటి సమయంతోపాటు రాత్రివేళల్లోనూ విధులు నిర్వర్తించాల్సి రావడం వల్ల టైప్‌-2 మధుమేహం వంటి జీవక్రియ సంబంధ వ్యాధుల తాకిడి పెరుగుతోందని పరిశోధనకు నాయకత్వం వహించిన ఇవో హేబెట్స్‌ పేర్కొన్నారు. పగటి సమయంలో వచ్చే సహజసిద్ధ కాంతి.. శరీర అంతర్గత జీవ గడియారానికి బలమైన సంకేతం. అయితే పగటి […]