Rajkumar Rao – ఈసీ నేషనల్ ఐకాన్‌గా బాలీవుడ్‌ స్టార్‌!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నవంబర్‌లో జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ECI) కీలక నిర్ణయం తీసుకుంది.  బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావును నేషనల్‌ ఐకాన్‌గా  నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దిల్లీలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం 11.30గంటలకు రంగ్‌భవన్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఎన్నికల కమిషనర్‌ గురువారం ఆయన్ను అధికారికంగా నియమించనున్నారు. 

Netflix – టాప్ 10లో ‘ఖుషి’..

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న థియేటర్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెలరోజులకు అక్టోబర్‌ 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అందులో ప్రసారం అవుతున్నప్పటి నుంచి టాప్‌ వ్యూస్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్‌ 10లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో ఈ వారం ఎక్కువమంది చూసిన చిత్రాల లిస్ట్‌ను తాజాగా […]

Rajinikanth – మూడు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్‌..

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తన ఆప్త మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తో కలిసి పని చేయడంపై నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. ‘‘33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి వర్క్‌ చేస్తున్నా. లైకా ప్రొడెక్షన్స్‌ పతాకంపై టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రంలో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. అమితానందంతో నా మనసు నిండింది’’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌తో దిగిన ఓ […]

Hardik Pandya – స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా..

గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. హార్దిక్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించే అవకాశాల్ని జట్టు మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది. చీలమండ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న హార్దిక్‌ వేగంగా కోలుకుంటున్నాడు.  ఈనెల 29న లఖ్‌నవూలో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడుతుంది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే సూర్యకుమార్‌ స్థానంలో […]

Vizag – రూ.1.30కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తున్న రూ.1.30కోట్ల నగదును విశాఖ క్రైమ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణానికి సంబంధించిన డబ్బుగా దీన్ని గుర్తించారు. ఆటోలో వాషింగ్‌ మెషిన్‌ను ఉంచి అందులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వాషింగ్‌ మెషిన్‌లో ఉంచి తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద […]

Israel-Hamas : గాజాపై దండయాత్రకు సిద్ధమే

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు (Israel Hamas Conflict) ప్రస్తుతం తగ్గుముుఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బందీలను కాపాడే విషయంలో ఇజ్రాయెల్‌ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో గాజాపై భూతల దాడులకు సిద్ధమైన టెల్‌అవీవ్‌.. సరిహద్దు ప్రాంతంలో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఈ నేపథ్యంలో గాజాపై దండయాత్రకు (Invasion) తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) మరోసారి స్పష్టం చేసింది. ‘ఒక మాట స్పష్టంగా […]

Cocaine : రూ.11 వేల కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. బియ్యం సంచుల్లో తరలిస్తూ..

అమెరికాలో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు బియ్యం సంచుల్లో కొకైన్‌ను తరలిస్తుండగా పరాగ్వే పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ₹11,623 కోట్ల విలువైన 3,312 కిలోల కొకైన్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Imax – హాలు నిండా దుర్వాసన వెదజల్లుతోంది

హైదరాబాద్‌: టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ ప్రేక్షకులను నిరాశపరిచింది. చివరి షో రాత్రి 11:15 గంటలకు ప్రారంభం కావడంతో ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు. శుక్రవారం హాలు నిండా దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా పిచికారీ చేయాలని సిబ్బందికి సమాచారం అందించారు. ముప్పై నిమిషాల తర్వాత కూడా దుర్వాసన వస్తూనే ఉండడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ బయటకు వచ్చారు, థియేటర్ ఉద్యోగులతో గొడవ పడ్డారు మరియు వారి డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి […]

PMO – ‘నకిలీ అధికారి’ కేసు..

ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో తానో ఉన్నతాధికారినని పేర్కొంటూ సెటిల్‌మెంట్‌ వ్యవహారానికి (PMO imposter case) దిగిన మోసగాడు మయాంక్‌ తివారీ (Maayank Tiwari) కేసులో సీబీఐ (CBI) దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా తివారీకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ కేసులో తివారీని ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. ‘డాక్టర్‌ […]

Australia’s intelligence chief – ట్రూడో ఆరోపణలను విభేదించడానికి కారణం లేదు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ట్రూడో చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆస్ట్రేలియన్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్ మైక్‌ బర్జెస్‌( Australian intelligence chief Mike Burgess) సమర్థించడం గమనార్హం. ట్రూడో ప్రకటనతో విభేదించేందుకు తనకు ఎటువంటి కారణం కనిపించడం లేదన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఫైవ్‌ ఐస్‌ […]