Kamareddy – రూ.25 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.

ఎల్లారెడ్డి;పత్తి చేను మధ్యలో పెంచిన రూ.25 లక్షలు విలువ చేసే గంజాయి మొక్కలను ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు.. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎక్సైజ్ ఎస్పీ రవీందర్ రాజ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీటీఎఫ్ స్క్వాడ్‌తో కలిసి గాంధారి మండలం అవుసులకుంట తండాకు చెందిన ధరావత్ జైత్రం తన పత్తి పొలంలో గంజాయిని పెంచుతున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.25 లక్షలు విలువ చేసే 232 మొక్కలను […]

Medak – సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు.

మెదక్‌:అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల పనులను సమర్ధవంతంగా నిర్వహించాలని పాలనాధికారి  రాజర్షిషా సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రతి అంశం బాధ్యతలకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినందున, PO బుక్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి. శాంపిల్ పోల్ నిర్వహించేటప్పుడు గమనించాల్సిన అంశాలను వివరించారు. పోలింగ్‌ అధికారులు (పీఓలు) పొరపాట్లు చేయరాదని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎం) పంపిణీ చేసిన రోజున తొలగించవద్దని, […]

Mancherial – మద్యం మత్తులో 20 నిమిషాల పాటు హోంగార్డు వీరంగం.

మంచిర్యాలరూరల్‌:మద్యం మత్తులో హాజీపూర్ పీఎస్ పరిధిలోని ఓ హౌస్ గార్డు వీరంగం సృష్టించాడు. సోమవారం కాంగ్రెస్ ప్రచార రథం హాజీపూర్ వీధుల్లో తిరుగుతూ మండలం జాతీయ రహదారిపైకి వచ్చింది. హోంగార్డు దానిని అడ్డుకుని డ్రైవర్ మహేంద్రపై దుర్భాషలాడాడు. మద్యం మత్తులో హోంగార్డు చేసిన గొడవను స్థానికులు అణిచివేసి, పోలీసులకు ఫోన్ చేశారు. రాగానే స్టేషన్‌కి తీసుకొచ్చారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు హోంగార్డు ఆర్టిలరీతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈలోగా, పరిస్థితిపై ఎస్‌ఎస్‌ఐ నరేష్‌కుమార్‌ను ప్రశ్నించగా, హోంగార్డు […]

Hanamkonda – కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జంగా రాఘవరెడ్డి.

హనుమకొండ;తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాను వెల్లడించినప్పటి నుంచి టిక్కెట్లు దక్కని పలువురు ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు జంగా రాఘవ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. రాయిఘవరెడ్డికి  కాంగ్రెస్ టికెట్ రాకవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్య నేతలతో అత్యవసరంగా చర్చించిన అనంతరం ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్ దక్కని జంగా రాఘవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాఘవరెడ్డి భవిష్యత్ […]

Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

Karnataka – ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్‌బళ్లాపూర్‌ పోలీసు అధికారి […]

Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

Canada : వీసా సేవల్ని పునరుద్ధరించనున్న భారత్‌..

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతలతో కెనడా పౌరులకు ఇటీవల భారత్‌ వీసా సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్‌ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టంచేసింది. భద్రతా పరిస్థితులపై సమీక్ష […]

Range Rover: బంపర్‌ ఆఫర్‌.. ₹100కే

అస్సాం(Assam) లోని హౌలీలో ఏటా నిర్వహించే రాస్ ఫెస్టివెల్(Raas Festival) సందర్భంగా నిర్వహించే లాటరీ(Lottery)లో ఈ సారి ఖరీదైన బహుమతులను అందివ్వనున్నట్లు నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం వంద రూపాయలకే రూ.76 లక్షలు విలువచేసే రేంజ్‌రోవర్‌(Range Rover) కారును ప్రథమ బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే ఈ కారును ఎలా గెలుచుకోవాలో చూద్దాం..  అస్సోంలోని హౌలీలో రాస్ పండగను నిర్వహిస్తారు. ఏళ్ల నాటిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా పండగకు ముందు లాటరీ ఈవెంట్‌ను ఏర్పాటు […]

Ram Mandir – ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ బుధవారం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి కోవెలను ప్రారంభించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. ‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావల్సిందిగా నన్ను […]