Provide Water For the drying crops ఎండిపోతున్న పంటలకు నీళ్లివ్వండి Harish Rao

ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ద్దిపేట, న్యూస్‌టుడే: ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. హరీశ్‌రావు సిద్దిపేటలో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. […]

Today Indiramma houses scheme is launched నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం

పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈనాడు, హైదరాబాద్‌: పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు […]

We Will Do Justice In PRC REVANTHREDDY పీఆర్‌సీలో న్యాయం చేస్తాం

తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌: తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఎస్‌ రద్దును […]

Nara Lokesh Public Is Graphics In YCP Meeting : వైకాపా ‘సిద్ధం’ సభలో జనమంతా గ్రాఫిక్స్: లోకేశ్‌

జగన్‌కు ధర్మ యుద్ధం ఇవ్వడానికి తెలుగుదేశం – జనసేన సిద్ధంగా ఉన్నాయని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కళలకు నిలయంగా ఉన్న రాజమహేంద్రవరం.. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. అమరావతి: మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ […]

TDP GUNNY TICKEY RALLY : గన్నికి టికెట్‌ ఇవ్వండి.. మేము గెలిపించుకుంటాం

రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా ఆదివారం తరలివెళ్లారు. భీమడోలు, న్యూస్‌టుడే: రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం […]

Nayana Tara Divorce: క్లారిటీ ఇచ్చిన నయన్

విడాకుల వార్తలకు వీడియోతో చెక్‌ పెట్టిన నయనతార దంపతులు. ఇంటర్నెట్‌ డెస్క్: విఘ్నేశ్‌ శివన్‌ నయనతార విడిపోతున్నట్లు కొంతకాలంగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా నయనతార భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం.. మళ్లీ కొంతసేపటికి ఫాలో చేయడం. ‘నేను సర్వం కోల్పోయాను’ అని పోస్ట్‌ పెట్టడం. మళ్లీ దాన్ని డిలీట్‌ చేయడం..  ఇవన్నీ ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే వీరు ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు.  కవల పిల్లలతో కలిసి వెకేషన్‌కు […]

అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం

శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి ‘ఒనవిల్లు: ది డివైన్ బో’ పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. […]

 ఓటీటీ కన్నా ముందే.. టీవీలో!

సంక్రాంతి బరి సూపర్‌హిట్‌గా నిలిచి దాదాపు రూ.330 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘హనుమాన్’ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి బరి సూపర్‌హిట్‌గా నిలిచి దాదాపు రూ.330 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘హనుమాన్’ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలై వారాలు దాటుతున్నా థియేటర్స్‌లో ఆదరణ బావుండటం వల్ల ఓటీటీ విడుదలను వాయిదా వేశారు. అయితే […]

YCP: వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు

కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ తల పట్టుకుంటున్నారు. కోనసీమ: కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ (YCP) ఎంపీ చింతా అనురాధ కు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి […]

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు. తెలుగు భాష, సాహిత్యం వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తా. భాష భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వాలు […]