Golden Toilet Theft.. : రూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’‌ చోరీ.. 

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ కోట్ల విలువైన బంగారు టాయిలెట్‌ కమోడ్‌ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొంగిలించాడు. ఈ కమోడ్ విలువ 48,00,000 పౌండ్లు అంటే సుమారు రూ. 50.36 కోట్లు ఉంటుందని ప్రాధమిక అంచనా వేశారు. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ […]

 World Top 10 Richest Persons : ప్రపంచ కుబేరుల జాబితా విడుదల.. 

ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలో ఫోర్బ్స్‌ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయులు ఈ జాబితాలో ఉండగా ఈ ఏడాది అది 200 కు చేరింది. నివేదిక ప్రకారం.. భారత బిలియనీర్ల మొత్తం సంపద 954 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది 675 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దాదాపు 41 శాతం పెరిగింది. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలో ఫోర్బ్స్‌ […]

IPL 2024, GT vs PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్‌ కింగ్స్‌ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది.  మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ […]

IPL 2024: Csk VS Sunrisers : HYDERABD సీఎస్‌కేతో తలపడనున్న సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 5) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్‌ విన్యాసాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రవిస్‌ హెడ్‌, అబిషేక్‌ శర్మ, […]

IPL 2024 GT VS PBKS:  శుభ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌.. సీజన్‌ టాప్‌ స్కోర్‌

పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ అయ్యాక తొలి హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్‌ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓటమిపాలైనప్పటికీ గిల్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో […]

Ajith hero who proved that : ధైర్యానికి హద్దులుండవని నిరూపించిన హీరో

యాక్షన్‌ సినిమాలంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్నవి. ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా స్వయంగా హీరోలే బరిలోకి దిగడం చాలా అరుదు. కానీ.. తమిళ కథానాయకుడు అజిత్‌ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. సినీప్రియుల్ని మెప్పించడానికి ఎంతటి సాహసాలకైనా వెనకాడరు. స్టంట్స్‌ చేయడంపై ఎప్పుడూ ఆసక్తి చూపించే అజిత్‌.. పలు చిత్రాల్లో డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ‘విదా ముయార్చి’ కోసం మరోసారి అలాంటి సాహసాలనే చేశారాయన. ఈ […]

Rajinikanth: Upcoming Movie రజినీకాంత్ కొత్త సినిమా పేరు ఏంటి ?

కథానాయకుడు రజనీకాంత్‌ – దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ల కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ఈనెల 22న ప్రకటించనున్నట్లు నిర్మాతలు ఇటీవల వెల్లడించారు. కాగా, ఇప్పుడా పేరుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం ‘కళుగు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనికి తెలుగులో డేగ అని అర్థం. రజనీ పాత్ర తీరు తెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర […]

BJP Andhra Pradesh : భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పని చేస్తా

ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు వ్యవసాయం : ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. శుక్రవారం భాజపా  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇటీవల ఎమ్మిగనూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి […]

Janasena TDP Quota: జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌!

జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట పవన్‌ కల్యాణ్. అవనిగడ్డ, భీమవరంలో ఇదే ఫార్ములా అనుసరించిన ఆయన, రేపు పాలకొండలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట […]

YS. Sharmila Congress Party Andhra : హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ: షర్మిల

ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. కాశినాయన: ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. […]