Another Khalistani- కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హతమయ్యాడు
ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడా (Canada)లో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే (Gangster Sukha Duneke) మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. కాగా.. ఈ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో […]