Air Hostess Arrested In Kerala After 1 Kg Gold Found In Rectum :విమానాశ్రయంలో అనుమానస్పదంగా ఎయిర్‌హోస్టెస్‌ ప్రవర్తన.. 

ఒకరు చెప్పుల్లో.. ఇంకొకరు ప్యాంట్‌ బెల్ట్‌లో.. మరొకరు బిస్కెట్ల రూపంలో.. కాదేదీ అనర్హం అంటూ గోల్డ్ స్మగ్లర్లు అన్ని అడ్డదారులు తొక్కేస్తున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్ది బంగారాన్ని వేర్వేరు స్టయిళ్లలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, నిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది. స్మగ్లింగ్.. స్మగ్లింగ్.. ఎటు చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఢిల్లీ టు […]

Trending News: Rats that ate 19 kg of Ganjai : 19 కేజీల గంజాయి తినేసిన ఎలుకలు!..

పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా 19 కేజీల డ్రగ్స్‌ని ఖాళీ చేసేశాయి. ఏంటీ.. ఎలుకలు గంజాయిని కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా […]

Lok Sabha Elections 2024: Rahul Gandhi Nomaination వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అతని సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ […]

Auto driver who won Rs. 10 crores with a ticket of ten rupees.ఇది మామూలు లక్ కాదు.. పది రూపాయల టిక్కెట్‌తో రూ.10 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్‌..

లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్ల రూపాయల లాటరీ గెలిచి అతడు కోటీశ్వరుడు అయ్యాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన నాజర్ ఇప్పుడు బంపర్ లాటరీ ద్వారా రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిపోయాడు. ఓ ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అదృష్టం అంటే ఇదేనప్ప..రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ను అదృష్ట లక్ష్మి వరించింది..రూ. ఊహించని విధంగా అతడు రాత్రిరాత్రికే రూ.10 కోట్లు సంపాదించాడని నెటిజన్లు సైతం సంతోషం […]

Citizenship Amendment Act: ‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’

తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ […]

P.Balasubramanian Menon – 97 ఏళ్ల వయసులోనూ కేసులు వాదిస్తున్నారు

ఆయన వయసు 97 ఏళ్లు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ వయసులో ఆయన ఇప్పటికీ కోర్టుకు హాజరై కేసుల్ని వాదిస్తున్నారు. అత్యధికంగా 73 ఏళ్ల 60 రోజులు నాయ్యవాదిగా పనిచేసి, ఏకంగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. ఈ రికార్డును సెప్టెంబరు 11న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ధ్రువీకరించింది. కేరళకు చెందిన ఈ న్యాయవాది పేరు పి.బాలసుబ్రమణియన్‌ మీనన్‌. అంత ముదిమి వయసులోనూ మీనన్‌ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. తన కార్యాలయానికి, కోర్టుకు హాజరవుతూ […]

Kerala – ఏ ఆకు కూరతో ఏం లాభమంటే..!

కేరళలోని కోజికోడ్‌లోని పుక్కాడ్‌కు చెందిన వన్నంగుని అబూబాకర్‌ (82) ఆకు కూరలతో కలిగే ప్రయోజనాలను యువతకు వివరిస్తూ తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను పండిస్తూ ప్రసిద్ధి చెందారు. కంటి సమస్యలు, ఊబకాయం, రక్తహీనత, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మనకు దొరికే ఆకుకూరల్లోనే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా జరిగే వ్యవసాయ సమ్మేళనాల్లో పాల్గొని.. అక్కడ వేల […]

Rajinikanth – వీడియో వైరల్‌

ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ముందు వరుసలో ఉంటారు. అలాగే తన అభిమానులను ఆయన ఎంతగా ఆదరిస్తారో కూడా తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌ తన 170వ (Thalaivar 170) చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ కేరళలోని తిరువనంతపురంలో తాజాగా ప్రారంభమైంది. ఆ చిత్రీకరణలో రజనీకాంత్ పాల్గొంటున్నారని తెలిసిన అభిమానులు వందలమంది లొకేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఆయన వాళ్లందరికీ […]

Snake – హెల్మెట్‌లో దూరిన ఘటన

బైక్‌పై లాక్‌ చేసి ఉంచిన హెల్మెట్‌లోకి నాగుపాము(Snake hides inside helmet) దూరిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. పుతూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్‌ సోజన్‌.. తాను పని చేసే చోట బైక్‌ను పార్క్‌ చేసి, దానికి హెల్మెట్‌ను లాక్‌ చేసి ఉంచాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ముందుగా హెల్మెట్‌ను తీస్తుండగా, ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి పరిశీలించి చూస్తే లోపల చిన్న పాము కనిపించింది. హడలిపోయిన అతడు […]

Kerala : రోల్స్‌ రాయిస్‌గా మారిన మారుతి 800 కారు

కేరళకు చెందిన 18 ఏళ్ల యువకుడు హదీఫ్‌… మారుతీ 800 కారును తక్కువ ఖర్చుతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారుగా మార్చేశాడు. సాధారణ కార్లను లగ్జరీ కార్లుగా మార్చడంపై అతడికి ఉన్న ఆసక్తితోనే ఇది సాధ్యమైంది. ఇందుకోసం కొన్ని నెలలపాటు శ్రమించి, రూ.45 వేలు ఖర్చు చేశాడు. కొత్తగా ఆవిష్కరించిన కారు అద్దాలు, చక్రాలు, హెడ్‌లైట్స్‌ సహా వివిధ భాగాలను అందంగా మలిచాడు. ముందు భాగంలో ఉన్న లోగోను స్వయంగా అతడే రూపొందించడం గమనార్హం. వైరల్‌గా మారి […]