KEADARNATH – రాహుల్‌ గాంధీ కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్‌లో మందిరం చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ‘‘ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ థామ్‌ను దర్శించి పూజ చేసుకున్నాను. హర్‌ హర్‌ మహాదేవ్‌’’ అని రాహుల్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సాయంత్రం హారతిలోనూ పాల్గొన్నారు. ‘ఛాయ్‌ సేవా’లో భాగంగా యాత్రికులకు టీ అందించారు. రాత్రికి రాహుల్‌ అక్కడే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.